సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

ABN, Publish Date - May 23 , 2026 | 06:20 PM

హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు జరిగే అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో యువ దర్శకులకు స్ఫూర్తినిస్తుంటాయి. ఇప్పుడొక సినిమా.. సరిగ్గా అలాంటి సంచలనమే సృష్టిస్తోంది.

Obsession Movie Update

హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అప్పుడప్పుడు జరిగే అద్భుతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో యువ దర్శకులకు స్ఫూర్తినిస్తుంటాయి. సరిగ్గా అలాంటి సంచలనమే సృష్టిస్తోంది ‘అబ్సెషన్’ (Obsession) అనే సరికొత్త హారర్ చిత్రం. అమెరికా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా, రెండో వీకెండ్‌లో మొదటి వారాంతం కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించే దిశగా రన్ అవుతోంది. కేవలం డొమెస్టిక్ మార్కెట్‌లోనే ఆదివారం నాటికి ఈ చిత్రం ఏకంగా 50 మిలియన్ డాలర్ల మార్కును అందుకోబోతోంది. వరుసగా మూడో రోజు కూడా అమెరికాలో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.


ఈ సినిమా బాక్సాఫీస్ పవర్ ఏ రేంజ్‌లో ఉందంటే.. పాప్ సంచలనం మైఖేల్ జాక్సన్ ప్రతిష్టాత్మక బయోపిక్ ‘మైఖేల్’ (Michael) వసూళ్లను సైతం ఈ సినిమా అధిగమించింది. ఒక్క రోజు కలెక్షన్స్‌‌తో ‘మైఖేల్’ సాధించిన 2.6 మిలియన్ డాలర్లను అధిగమించి, 3.2 మిలియన్ డాలర్లతో ‘అబ్సెషన్’ టాప్‌లో నిలవడం చూస్తుంటే.. ఈ సినిమా కలెక్షన్ల సునామీకి అంతం ఎక్కడ? అనేలా టాక్ మొదలైంది. అత్యంత హింసాత్మక కథాంశంతో, ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టే ఒక అన్‌సెట్లింగ్ హారర్ డ్రామాగా ‘అబ్సెషన్’ను రూపొందించారు. ఇందులో ఇండియా నవరెట్, కర్రీ బార్కర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. థియేటర్లలో ఈ సినిమా అందిస్తున్న హారర్ ఎక్స్‌పీరియెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ఇక ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ చిత్రాన్ని కేవలం 1 మిలియన్ డాలర్ల (మన భారతీయ కరెన్సీలో సుమారు రూ. 10 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కించారు. కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ సినిమాకున్న ఆదరణ చూస్తుంటే.. ఫుల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈజీగా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1000 కోట్లు) వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే, పెట్టిన పెట్టుబడికి ఏకంగా వంద రెట్లు లాభాలన్నమాట. మొత్తంగా అయితే, గ్లోబల్ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. దీంతో సినిమా వాళ్లంతా.. ఇది కదా సక్సెస్ అంటే? అంటూ రియాక్ట్ అవుతుండటం విశేషం.

ఇవి కూడా చదవండి:

40 ఏళ్ల తర్వాత సీక్వెల్‌కు ప్లాన్.. ఈ మూవీ వివరాలు తెలిస్తే షాకే!

ఏయన్నార్ నటవారసునిగా మెప్పించిన నాగార్జున

MEGA158: ‘దట్స్ ఇట్.. ద బ్లడీ బెంచ్ మార్క్’.. టైటిల్ లీక్ చేసేస్తా!

అసలు చరణ్ - ఎన్టీఆర్ మధ్య ఏం జరుగుతోంది?

Updated Date - May 23 , 2026 | 06:28 PM