‘జురాసిక్ పార్క్’ డాక్టర్ అలన్ గ్రాంట్ కన్నుమూత
ABN, Publish Date - Jul 13 , 2026 | 03:55 PM
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు సామ్ నీల్ (78) కన్నుమూశారు. 2026, జూలై 13 సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయన చివరి శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
హాలీవుడ్ (Hollywood) చిత్ర పరిశ్రమలో తన అద్భుత నటనతో దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను అలరించిన లెజెండరీ నటుడు సామ్ నీల్ (78) కన్నుమూశారు. 2026, జూలై 13 సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆయన చివరి శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కుటుంబ సభ్యుల సమక్షంలో కన్నుమూశారని సమాచారం. ఆయన మరణం హాలీవుడ్ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సామ్ నీల్ (Sam Neill) హఠాన్మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సామ్ నీల్ మరణం చాలా అకస్మాత్తుగా, ఊహించని విధంగా సంభవించిందని తెలుస్తోంది. ఆయన గతంలో క్యాన్సర్ బారిన పడినప్పటికీ, మరణించే సమయానికి క్యాన్సర్ నుంచి పూర్తిగా విముక్తి పొంది ఉన్నారని కుటుంబం స్పష్టం చేసింది. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది ఆయనకు అందించిన అద్భుతమైన వైద్య సేవలకు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కష్టసమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని, అంత్యక్రియలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.
సామ్ నీల్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు మొట్టమొదట గుర్తొచ్చే పాత్ర ‘జురాసిక్ పార్క్’ (Jurassic Park) చిత్రంలోని డాక్టర్ అలన్ గ్రాంట్ (Dr. Alan Grant). స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ సిరీస్‌లో డైనోసార్ల నిపుణుడిగా ఆయన పోషించిన పాత్ర సినిమా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయింది. బాల్యం నుంచి ఆయన సినిమాలను చూస్తూ పెరిగిన అభిమానులు.. ‘మా చిన్నప్పటి హీరో, అద్భుతమైన నటుడు, మా డాక్టర్ అలన్ గ్రాంట్ ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. మీరు అందించిన జ్ఞాపకాలకు ధన్యవాదాలు’ అంటూ భావోద్వేగంగా పోస్టులు పెడుతున్నారు. సామ్ నీల్ మరణంతో హాలీవుడ్ ఒక గొప్ప నటుడిని, ఒక మంచి మానవతావాదిని కోల్పోయింది.
ఇవి కూడా చదవండి:
‘వారణాసి’లో చిన్నప్పటి మహేష్‌గా అభయ్ రామ్.. స్క్రీన్స్ ఉంటాయా!
హాలీవుడ్ దర్శకుడిని ఆకర్షించిన మహేష్ తనయుడు.. ఏం జరుగుతోంది
నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను: కౌసల్య