సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రముఖ డైరెక్టర్ మృతి.. విషాదంలో ఇండస్ట్రీ

ABN, Publish Date - Jul 25 , 2026 | 12:10 PM

హాలీవుడ్‌లో తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శక, నిర్మాత చక్ రస్సెల్ (74) హఠాన్మరణం చెందారు. కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఆయన విగతజీవిగా కనిపించడంతో హాలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.

Director Chuck Russell

హాలీవుడ్‌లో తనదైన శైలి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ దర్శక, నిర్మాత చక్ రస్సెల్ (74) హఠాన్మరణం చెందారు. కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఆయన విగతజీవిగా కనిపించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఆయన మరణానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా విస్తరించిన ఆయన సినీ ప్రయాణం ముగియడంతో హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు ఆయనకు అశ్రునయనులతో నివాళులు అర్పిస్తున్నారు. (Hollywood Director Chuck Russell)


చక్ రస్సెల్ (Chuck Russell) తన కెరీర్‌లో హారర్, కామెడీ, యాక్షన్, ఫాంటసీ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా జిమ్ క్యారీ హీరోగా వచ్చిన ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ది మాస్క్’ (The Mask), హారర్ క్లాసిక్స్ ‘ఎ నైట్‌మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3: డ్రీమ్ వారియర్స్’, ‘ది బ్లాబ్’ (The Blob), డ్వేన్ జాన్సన్ ది రాక్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది స్కార్పియన్ కింగ్’ (The Scorpion King) వంటి అద్భుతమైన చిత్రాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.


కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాకుండా, భారతీయ చిత్రసీమలోనూ తన ముద్ర వేశారు చక్ రస్సెల్. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘జంగ్లీ’ (Junglee) అనే చిత్రానికి ఆయన దర్శకత్వం వహించి, భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాలుగు పదుల సినీ ప్రయాణంలో ఎంతోమంది అగ్ర నటుల కెరీర్‌కు మైలురాయిగా నిలిచిన చిత్రాలను అందించిన చక్ రస్సెల్ మరణం హాలీవుడ్ రంగానికి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

విద్యార్థుల పోరాటానికి సినీ ప్రముఖుల సంఘీభావం

సోషల్ మీడియాకు ఈ హీరోయిన్లు బైబై

ఈ వయసులో శ్రీరాముడి పాత్రలో జీవించడం చాలా కష్టం: రణ్‌బీర్ కపూర్

అల్లుడు భద్రంకు ‘మెగా158’లో అవకాశం.. సోము వీర్రాజు ఏం చేశారంటే

Updated Date - Jul 25 , 2026 | 12:10 PM