సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘స్పైడర్‌మ్యాన్’ కోసం రంగంలోకి జీవీ ప్రకాశ్.. ఏం చేశారంటే

ABN, Publish Date - Jul 27 , 2026 | 06:20 PM

హాలీవుడ్ చిత్రాలు ఇతర ఇండస్ట్రీలలో విడుదలవుతున్నప్పుడు, అక్కడి స్టార్స్ సపోర్ట్ చేస్తుంటారనే విషయం తెలియంది కాదు. ఒక్కోసారి వారి వాయిస్ కూడా అందులోని పాత్రలకు ఇస్తుంటారు.

Spider-Man Anthem

హాలీవుడ్ చిత్రాలు ఇతర ఇండస్ట్రీలలో విడుదలవుతున్నప్పుడు, అక్కడి స్టార్స్ సపోర్ట్ చేస్తుంటారనే విషయం తెలియంది కాదు. ఒక్కోసారి వారి వాయిస్ కూడా అందులోని పాత్రలకు ఇస్తుంటారు. జూలై 30న విడుదలకు సిద్ధమైన ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ (Spider-Man Brand New Day) కోసం ఇప్పుడో సంగీతం దర్శకుడు ఏకంగా ఓ సాంగ్‌నే క్రియేట్ చేశారు. సినిమా విడుదలకు ముందు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ జాతీయ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ (G.V.Prakash Kumar) ప్రత్యేకంగా ఓ స్పైడర్‌మ్యాన్ ఆంథమ్‌ (Spider-Man Anthem)ను విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ సాండీ మాస్టర్ (Sandy Master) కొరియోగ్రఫీ అందించగా, వెంగాయో ఫాలో అయ్యారు. ఈ మ్యూజిక్ వీడియోలో స్పైడర్‌మ్యాన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. సాండీ మాస్టర్ రూపొందించిన స్టెప్పులు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి డ్యాన్స్ చేసేలా ఆకట్టుకునేలా ఉన్నాయి. టామ్ హాలండ్ హీరోగా నటించిన ‘స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ సినిమా జూలై 30న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఈ పాట విడుదల సందర్భంగా జీవీ ప్రకాశ్ మాట్లాడుతూ.. ‘‘సంగీతం, స్పైడర్‌మ్యాన్ రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కలిపే శక్తి ఎంతో ఉంది. చిన్నప్పటి నుంచి నేను స్పైడర్‌మ్యాన్ అభిమానిని. అలాంటి అభిమాన హీరో కోసం పాట కంపోజ్ చేసే అవకాశం రావడమే గొప్ప విషయం. ఈ పాట చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాట కూడా అభిమానులంతా గుర్తుంచుకునే మరో స్పైడర్‌మ్యాన్ జ్ఞాపకంగా నిలుస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. సాండీ మాస్టర్ మాట్లాడుతూ.. స్పైడర్‌మ్యాన్ అంటే ప్రతి ఒక్కరిలోని చిన్నపిల్లాడిని బయటకు తీసుకొచ్చే ఒక సూపర్ హీరో. అందుకే ఈ పాటలో సరదా, ఉత్సాహం కనిపించేలా స్టెప్పులు రూపొందించడం జరిగింది. అందరితో డ్యాన్స్ చేయించేలా ఈ పాటను చేశాం. అందరూ పాటతో ఆనందిస్తారని అనుకుంటున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

యాక్టింగ్‌లోకి దిగిన దర్శకుడు.. ‘అనకాపల్లి’ ట్రైలర్ ఎలా ఉందంటే

అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు క్యూ.. ‘పెద్ది’ సారూ?

మరీ ఈ రేంజ్‌లోనా.. ఆదర్శకుటుంబం వెంకీ పాత్ర రివీల్

Updated Date - Jul 27 , 2026 | 06:24 PM