సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Odyssey: క్రిష్టోఫ‌ర్ నోలన్.. ది ఒడిస్సీ తెలుగు ట్రైల‌ర్‌

ABN, Publish Date - May 05 , 2026 | 06:50 PM

ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ది ఒడిస్సీ

The Odyssey

ప్ర‌పంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పెడెప్పుడా అని ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ది ఒడిస్సీ (The Odyssey). మ‌రో రెండు నెల‌ల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టీజ‌ర్ మూవీపై అప్ప‌టివ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేయ‌గా తాజాగా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌గా క్ష‌ణాల్లో వైర‌ల్ అయి ఇంట‌ర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఇన్‌సెప్ష‌న్‌, టెనెట్‌, ఇన్‌స్టా స్టెల్లార్‌, ఓపెన్ హైమ‌ర్ వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన ది గ్రేట్ క్రియేటివ్ జీనియ‌స్ క్రిష్టోఫ‌ర్ నోలన్ (Christopher Nolan) ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ రూపొందడంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీకి భారీ హైప్ ఉంది.

మ‌న ద‌గ్గ‌ర స్టార్లు షారుఖ్‌, అమితాబ్‌, చిరంజీవి, ర‌జనీకాంత్ వంటి స్టార్ల‌కు హీరోలుగా, ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళికి ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు ఉన్నాయో వాటిని మించిన ఘ‌న‌త క్రిష్టోఫ‌ర్‌కు ఉంద‌న‌డంలో ఏమాత్రం అతిశ‌యోక్తి కాదు. అంత క్రేజ్ ఉంది కాబ‌ట్టే సినిమా ఈ జూలైలో విడుద‌ల ఉండ‌గా గ‌త ఏడాది జూలై నుంచే అమెరికా, కెన‌డా, లండ‌న్ వంటి దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసి టికెట్లు సేల్ చేశారంటే సినిమాపై ప్రేక్ష‌కులు ఎంత‌గా క్రేజీగా ఉన్నారో అర్థ‌మ‌వుతోంది. అంతేగాక ప్ర‌సిద్ధిగాంచిన గ్రీకు పురాణ గాథ అధారంగా సినిమా తెర‌కెక్క‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఇక తాజాగా విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇతాకా అనే సామ్రాజ్యానికి చెందిన చ‌క్ర‌వ‌ర్తి ఒడిస్సియస్ త‌న‌ భార్య‌, కుమారుల‌ను రాజ్యంలోనే ఉంచి సైన్యంతో ట్రోజన్ రాజ్యంపై యుద్దానికి వెళ్లి విజ‌యం సాధిస్తాడు. ఆపై తిరిగి త‌న రాజ్యానికి వ‌చ్చే క్ర‌మంలో వారి స‌ముద్ర‌ ప్ర‌యాణంలో వారికి ఎదురైన ఆటుపోట్లు, వింత వింత మ‌న‌షుల దాడులు, ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, మంత్రాలు, మంత్ర‌గ‌త్తెలు, రాక్ష‌సులు ఇలా అనేకానేక‌ అవాంత‌రాల‌ను ఎదుర‌వుతాయి.

ఇలాంటి ప‌రిస్థితుల‌లో త‌న సైన్యంతో వాటినన్నింటిని ఎదుర్కోగ‌లిగాడా లేదా చివ‌ర‌కు త‌న రాజ్యానికి చేరుకున్నాడా లేదా అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ క‌థ‌నాల‌తో చిత్రం సాగుతుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు చూడ‌ని విజువ‌ల్ గ్రాండియ‌ర్‌గా, అడ్వెంచ‌ర‌స్ జ‌ర్నీగా సినిమా ఉండ‌నుంది. జూలై 17 న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Updated Date - May 05 , 2026 | 06:50 PM