‘అవెంజర్స్: డూమ్స్‌డే’ కొత్త ప్రోమో!
ABN, Publish Date - Aug 15 , 2026 | 02:33 PM
అవెంజర్స్: డూమ్స్ డే నుంచి కొత్త ప్రోమో వచ్చింది. డాక్టర్ డూమ్ ప్రతినాయకుడిగా ఎందుకు మారాల్సి వచ్చిందనే అంశానికి ఈ ప్రోమోలో ప్రాధాన్యమిచ్చారు.
మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’. తాజాగా ఈ సినిమా నుంచి ప్రత్యేక ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. డి 23: ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్‌లో ఈ ప్రోమోను విడుదల చేశారు. మార్వెల్ స్టూడియోస్ అధ్యక్షుడు కెవిన్ ఫైజీతో పాటు ఆస్కార్ అవార్డు విజేత రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, హేలీ అట్వెల్ ఈ ప్రత్యేక ప్రోమోను ఆవిష్కరించారు.
ఈ ప్రోమోలో రాబర్ట్ డౌనీ జూనియర్ విక్టర్ వాన్ డూమ్/డాక్టర్ డూమ్ పాత్రలో కనిపించారు. ఇప్పటివరకు ఐరన్ మ్యాన్‌గా ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన రాబర్ట్ డౌనీ జూనియర్, ఇప్పుడు మార్వెల్ కామిక్ యూనివర్స్‌లో అత్యంత శక్తివంతమైన విలన్‌గా కనిపించనుండటం ఆసక్తిని పెంచుతోంది. ప్రోమోలో సూ స్టార్మ్ పాత్రలో నటిస్తున్న వెనెస్సా కిర్బీ, డాక్టర్ డూమ్ విలన్‌గా మారే కథకు సంబంధించిన కీలక అంశాలను పరిచయం చేశారు. అలాగే డాక్టర్ డూమ్, థోర్ మధ్య భారీ పోరాటానికి సంబంధించిన సంకేతాలు కూడా ప్రోమోలో చూపించారు.
‘అవెంజర్స్: డూమ్స్‌డే’ చిత్రానికి ఆంథోనీ రస్సో, జో రస్సో దర్శకత్వం వహిస్తున్నారు. కెవిన్ ఫైజీ, లూయిస్ డి’ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రాబర్ట్ డౌనీ జూనియర్‌తో పాటు క్రిస్ ఎవాన్స్, క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, వెనెస్సా కిర్బీ, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, టామ్ హిడిల్‌స్టన్, జేమ్స్ మార్స్‌డెన్, ప్యాట్రిక్ స్టీవర్ట్, జోసెఫ్ క్విన్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మూడు విభిన్న విశ్వాలకు చెందిన హీరోలు ఒకే చోట కలుసుకుని, ఇప్పటివరకు ఎదుర్కోని అత్యంత ప్రమాదకరమైన ముప్పును ఎదుర్కొనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ 2026 డిసెంబర్ 18న భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?
డీపీ మార్చిన రెబల్ స్టార్.. ఇక అంతా ‘ఫౌజీ’ గురించే!
పోతురాజు ఆహార్యంలో శ్రీహరి తనయుడు.. పోస్టర్ అదిరింది!