భారత్‌లో ఒకరోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:30 PM

భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుక అందించింది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ నటించిన ‘అవెంజర్స్: డూమ్స్ డే’ డిసెంబర్ 17, 2026న భారత్‌లో విడుదల కానుంది.

Avengers Doomsday

భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుకగా ఓ ఆనందకరమైన ప్రకటన చేసింది. రాబర్ట్ డౌనీ జూనియర్‌, క్రిస్ ఎవాన్స్ ప్రధాన పాత్రలు పోషించిన 'అవెంజర్స్: డూమ్స్ డే' సినిమాను అమెరికాలో కంటే ఒక రోజు ముందే ఇండియాలో విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న విడుదల కాబోతోంది. అయితే భారత్‌లో మాత్రం డిసెంబర్ 17న దీనిని విడుదల చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

'అవెంజర్స్: డూమ్స్ డే' సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖ నటులు రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్ భారతీయ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ డాక్టర్ డూమ్‌గా, క్రిస్ ఎవాన్స్ స్టీవ్ రోజర్స్‌గా కనిపించనున్నారు.


వీడియో సందేశంలో వారు మాట్లాడుతూ, ‘నమస్తే ఇండియా! దీపావళి అంటే ఒక అధ్యాయం ముగిసి, మరో కొత్త అధ్యాయం ప్రారంభం కావడం. ఈ విషయం గురించి మాకు బాగా తెలుసు. అయితే, చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి బదులుగా, ఈసారి బహుశా వెలుగు నుంచి చీకటివైపు ప్రయాణం సాగుతుందేమో! అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ‘అవెంజర్స్: డూమ్స్‌డే’లో కలుద్దాం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మూడు విభిన్న విశ్వాలకు చెందిన అభిమాన హీరోలు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఎదురెదురుగా నిలవనున్నారు. వారు ఎన్నడూ ఎదుర్కోని అత్యంత భయంకరమైన ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సాగే పోరాటాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనున్నాయి.


ఆంథోనీ రుస్సో, జో రుస్సో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కెవిన్ ఫైజ్, లూయిస్ డి'ఎస్పోసిటో, జోనాథన్ ష్వార్ట్జ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్‌లతో పాటు క్రిస్ హేమ్స్‌వర్త్, పెడ్రో పాస్కల్, పాల్ రూడ్, ఆంథోనీ మాకీ, ఫ్లోరెన్స్ ప్యూ, వెనెస్సా కిర్బీ, ఈబన్ మాస్-బాచ్రాక్, వ్యాట్ రస్సెల్, చానింగ్ టాటమ్, సిము లియు, ఇయాన్ మెక్‌కెల్లెన్, హేలీ అట్వెల్, టామ్ హిడిల్‌స్టన్, జేమ్స్ మార్స్‌డెన్, పాట్రిక్ స్టీవర్ట్, జోసెఫ్ క్విన్, సెబాస్టియన్ స్టాన్, డేవిడ్ హార్బర్, లెటిటియా రైట్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 17, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, భారతీయ థియేటర్లలో అదే రోజు ప్రత్యేక ప్రీమియం ఫార్మాట్లతో పాటు మార్వెల్ స్టూడియోస్ అందించే ఇన్ఫినిటీ విజన్ ఫార్మాట్‌లోనూ ప్రదర్శితం కానుంది.

ఇవి కూడా చదవండి:

Nayanthara: 60 అడుగులతో.. నయనతార భారీ కటౌట్

అబ్సెషన్.. తెలుగు ఏం పాపం చేసింది

ఏం జరుగుతోందిరా.. శ్రీనిధి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్

Updated Date - Oct 28 , 2026 | 01:36 PM

God of War: టైగ‌ర్‌.. అభిమానుల చిర‌కాల కోరిక! ఇది క‌దా న్యూస్‌

ఒకే రోజు ముగ్గురు కింగ్స్.. డిసెంబర్ 24న బాక్సాఫీస్ దగ్గర అసలైన పోరు!

Nayanthara: 60 అడుగులతో.. నయనతార భారీ కటౌట్

నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్ తో విడాకులు కోసమేనా

టాలీవుడ్‌లోకి కంగనా రనౌత్ గ్రాండ్ రీఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే?