సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Missing Meghana Review: 'మిస్సింగ్ మేఘన' మూవీ ఎలా ఉందంటే

ABN, Publish Date - Sep 18 , 2026 | 01:56 PM

ఈవారం పెద్ద సినిమా హవా లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. ఈ శుక్రవారం విడుదలైన అరడజను చిత్రాల్లో ‘మిస్సింగ్‌ మేఘన’ ఒకటి. రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి, కౌశిక్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్‌, క్రైమ్‌, లవ్‌ థ్రిల్లర్‌గా ఎలా ఉందో చూద్దాం.

Missing Meghana

సినిమా రివ్యూ: ‘మిస్సింగ్‌ మేఘన’

విడుదల తేది: 18-9-2026

ఈ వారం పెద్ద సినిమాల హవా లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. ఈ శుక్రవారం విడుదలైన పది చిన్న సినిమాల్లో ‘మిస్సింగ్‌ మేఘన’ ఒకటి. పంచుమర్తి నరేష్‌ బాబు నిర్మాణంలో వాచస్పతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ట్రైలర్‌, టీజర్‌లతో ఆసక్తి పెంచిన 'మిస్సింగ్‌ మేఘన' శుక్రవారం రిలీజ్‌ అయింది. సస్పెన్స్‌, క్రైమ్‌, లవ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ: (Missing Meghana review)

మేఘన (అమ్ము అభిరామి) చదువు పూర్తి చేసి ఏదైనా బిజినెస్‌ చేయాలని ప్లాన్‌ చేస్తుంది. అలా నానా కష్టాలు పడి లోన్‌ తెచ్చుకుని ఓ బేకరీ స్టార్ట్‌ చేస్తుంది. షాపు కట్టేసి ఎంత లేట్‌ అయినా ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి శ్రీనివాసరావు (గోపరాజు రమణ) పోలీసులను ఆశ్రయిస్తాడు. అయితే ఈ కేసును పోలీసులు పెద్దగా పట్టించుకోరు. మేఘనతో పెళ్లి ఫిక్స్‌ అయిన ఏసీపీ అర్జున్‌ (కౌశిక్‌) రంగంలోకి దిగి ఈ కేసును టేకప్‌ చేస్తాడు. ఆమె చివరిగా ఎవరితో మాట్లాడింది.. ఎక్కడ మిస్‌ అయింది అనే యాంగిల్‌లో ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెడతాడు. ఇందులో భాగంగా అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ విచారిస్తారు. ఈ క్రమంలో మేఘనను చివరిసారిగా బైక్‌పై డ్రాప్‌ చేసిన రామ్‌ కార్తిక్‌ పోలీసులకు చిక్కుతాడు. విచారణ చేయగా ఆద్య (వైదిక సెంజాలియా)తో తనకున్న ప్రేమ, బ్రేకప్‌ గురించి వివరిస్తాడు. మేఘన కాల్‌ లిస్ట్‌ తీయగా ఆమెతో ఎక్కువగా మాట్లాడింది కార్తీక్‌ అని తెలుస్తుంది. అసలు కార్తిక్‌ కాల్‌ లిస్ట్‌ వెనకున్న కథేంటి? మేఘనను ఎవరు కిడ్నాప్‌ చేశారు? ఈ కథలో డ్రగ్స్‌ కేసు ఎలా వచ్చింది అన్నది కథ.


విశ్లేషణ:

మేఘన మిస్సింగ్‌ కేసుతో మొదలైన కథ.. లవ్‌, మూడు మర్డర్లు, క్రైమ్‌, డ్రగ్స్‌ ఇలా రకరకాల మలుపు తిరుగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో జరిగే విచారణ అంతా సోసోగా సాగుతుంది. హీరో కార్తీక్‌ ఎంట్రీ తర్వాత కథలో వేగం, ఆసక్తి పెరుగుతాయి. ఇంటర్‌వెల్‌లో ఇచ్చిన ట్విస్ట్‌ మాత్రం సెకెండాఫ్‌పై ఆసక్తి కలిగిస్తుంది. ద్వితీయార్థంలో కిడ్నాప్‌ కేసు కాస్త మర్డర్స్‌, డ్రగ్స్‌ వ్యవహారంతో లింక్‌ కావడంతో ఇంకాస్త ఆసక్తి కలుగుతుంది. స్టోరీ రన్‌ కూడా స్పీడప్‌ అవుతుంది. మేఘన ఎలా మిస్‌ అయింది, ఎవరు కిడ్నాప్‌ చేశారన్న అంశాలతో చివరి వరకూ సస్పెన్స్‌ మెయిన్‌టెన్‌ చేయగలగడం బావుంది. ఈ విషయంలో దర్శకుడు తన ప్రతిభను చాటాడు. విలన్‌ ఎవరనేది మాత్రం ఊహకు అందేలా చేశాడు. ఆ సన్నివేశాల్లో గ్రిప్‌ కోల్పోయాడు. క్లైమాక్స్‌ మాత్రం బాగానే ప్లాన్‌ చేశారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

మేఘనగా అమ్ము అభిరామి పెర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయింది. క్యూట్‌ యాక్టింగ్‌తో అలరించింది. లవ్‌ ఫెయిల్‌ అయిన వ్యక్తిగా రామ్‌ కార్తిక్‌ బాగా నటించాడు. క్లైమాక్స్‌లో యాక్షన్‌ సన్నివేశాలతోనూ మెప్పించాడు. ఏసీపీ అర్జున్‌గా కౌశిక్‌ బెస్ట్‌ అనిపించుకున్నాడు. వైదిక సెంజాలియా ఫర్వాలేదు. అంకిత్‌ కొయ్య, గోపరాజు రమణతోపాటు వెంప కాశి, మహిపాల్‌, రుచిత తదితరులు పాత్రల మేరకు మెప్పించారు. సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. కొన్ని షాట్స్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. ఆర్‌.ఆర్‌. ధ్రువన్‌ పాటలు ఫర్వాలేదనిపించాయి. నేపథ్య సంగీతం మాత్రం రీసౌండ్‌ వచ్చేసింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ కావలసిన రీరికార్డింగ్‌ సంగీత దర్శకుడు ఇవ్వలేకపోయాడు. ఫస్టాఫ్‌ కాస్త ల్యాగ్‌ అనిపిస్తుంది. ఎడిటర్‌ కాస్త దృష్టి పెట్టుంటే అవుట్‌పుట్‌ క్రిస్ప్‌గా ఉండేది. నిర్మాణ విలువలకు పేరు పెట్టక్కర్లేదు. క్రైమ్‌, సస్సెన్స్‌ థ్రిల్లర్స్‌ ఎప్పుడు గ్రిప్పింగ్‌గా ఉంటేనే ఆడియన్‌కి ఆసక్తి ఉంటుంది. దర్శకుడు ఆ విషయంలో చాలా వరకూ బ్యాలెన్స్‌ చేశాడు. అక్కడక్కడా గ్రిప్‌ మిస్సయ్యింది. అయితే క్లైమాక్స్‌ వరకూ మెయిన్‌టెన్‌ చేసిన సస్సెన్స్‌, ఇన్వెస్టిగేషన్‌ వంటి సన్నివేశాలు మాత్రం పక్కాగా ఆకట్టుకుంటాయి. క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే వారికి నచ్చే సినిమా ఇది.

ట్యాగ్‌లైన్‌: మేఘన.. మిస్సింగ్‌.. మిస్టరీ.. ఓకే..

రేటింగ్‌: 2.5/5

Updated Date - Sep 18 , 2026 | 02:17 PM