Dhee Raju: ప్లాన్ ప్రకారమే.. బాధితురాలికి కాల్! ఆపై ఎమోషనల్‌గా డ్రామా.. సీరియల్ నటితో గోవాలో జల్సాలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 09:55 AM
ఢీ-10 షో విన్నర్‌గా వెలుగులోకి వచ్చిన డ్యాన్సర్ రాజు లైంగిక వేధింపుల కేసులో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి.
లైంగిక వేధింపుల కేసులో మార్మోగుతున్న ఢీ-10 విన్నర్ (Dhee 10 Winner) రాజుదిగా చెబుతోన్న ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో వినిపిస్తున్న మాటలు.. ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలను మరింత పెంచుతున్నాయి. ఇక నుంచి మనం ఫ్రెండ్స్‌లా ఉందాం.. ఈ రిలేషన్ వద్దంటూ రాజు ప్లాన్ ప్రకారమే మాట మార్చినట్లు ఆ ఆడియో వింటే అర్థం అవుతుంది .. ఐదు నెలలుగా ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరై 12 లక్షలు డబ్బులు తీసుకున్నాడు .. బాధితురాలు ఇచ్చిన డబ్బులతో మరో సీరియాల్ యాక్టర్ తో తిరుగుతూ గోవాతో ఇతర ప్రాంతాలకు వెళ్లి జల్సా చేసినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.
ఇక ప్లాన్ ప్రకారమే బాధితురాలుకు కాల్ చేసి ఆ కాల్‌ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. రాజు అరెస్ట్ అయి రిమాండ్ అయినా తరువాత ఆ కాల్ రికార్డింగ్‌ను ఎడిట్ చేసి సోషియల్ మీడియా, యూట్యూబ్ చానల్స్‌కి రాజు తరుఫున వారే అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐదు నెలలు క్రితం ఢీ డ్యాన్సర్ రాజు పరిచయం అయ్యాక , ప్రేమ పెళ్లి ప్రస్తావన తెచ్చాడని.. నమ్మి 12 లక్షలు వరకు డబ్బులు ఇచ్చినట్లు బాధితురాలు చెబుతోంది. అయితే ఇలా చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ రాజుకు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
పరిచయం అయిన అమ్మాయిలకు దగ్గర అవ్వడానికి రాజు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.. ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పి కిందపడిపోవడం.. లేదా వారి దగ్గర ఆశ్రయం పొందడం వంటివి చేసి దగ్గరై పోతాడని.. నిజమేనేమో అని నమ్మి చాలా మంది అమ్మాయిలు రాజును ఇలాగే చేరదీసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేసు పెట్టిన బాధితురాలు వద్ద కూడా తనకు ఆరోగ్యం సరిలేదని.. రెస్ట్ తీసుకుంటా అని చెప్పి వచ్చి .. ఎమోషనల్‌గా డ్రామా క్రియేట్ చేసి దగ్గరైనట్లు పోలీసుల విచారణలో తేలింది.
లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన రాజు వ్యవహారంలో ఒకవైపు పోలీసులు విచారణ చేస్తుండగా , మరోవైపు కొన్ని యూట్యూబ్ చానెల్స్ , సోషల్ మీడియాలో బాధితురాల వివరాలు, అడ్రెస్, వ్యక్తి గత సమాచారం బయట పెట్టడం అనేది చట్టప్రకారం శిక్షార్హులు .. దీంతో వారందరిపై పరువు నష్టం దావా కేసులు వేసి న్యాయపోరాటం చేయడానికి బాధితురాలు సన్నద్ధం అయినట్లు సమాచారం. ఇక వైరల్‌గా మారిన ఆడియోలో రాజునే భాదితురాలితో ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమిలాడుతున్నాడు. ఇది లవ్ కాదని కేవలం డబ్బులు వ్యవహారమే అని చెప్పి సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు.
అయితే ఈ గొడవ కూడా డబ్బులు వద్ద రాలేదని బాధితురాలు వద్ద తీసుకున్న లక్షల రూపాయలతో మరో సీరియల్ నటికి ఖర్చు చేస్తూ ఆమెతో తిరుగుతున్నాడని గుర్తించి ఈ వ్యవహారంపై బాధితురాలు నిలదీయడంతో కాళ్ళ బేరానికి రాజు వచ్చాడని తెలుస్తోంది. అడ్డంగా దొరికిపోయిన తరువాత తన తప్పులు బయట పడటంతో మాట మార్చి లవ్ చేయను, ఫ్రెండ్‌గా ఉంటానని ఆ ఆడియో కాల్లో రాజు చెప్పుకొచ్చాడు.. కేవలం సీరియల్ నటి మాయలో పడిపోయాడని పెళ్లి పేరు ఎత్తేటప్పటికి లవ్ చేయను ఫ్రెండ్‌గా ఉంటానని మోసం చేశాడని బాధితురాలు కూడా ఆరోపిస్తున్నారు.
ఇంత జరిగిన తర్వాత కూడా బాధితురాలు దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇచ్చాడా అంటే అదీలేదు .. ఒక వైపు ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడం మరోవైపు డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోవడం అదే డబ్బులతో జల్సాలు చేస్తూ సీరియల్ నటికి ఖర్చు చేస్తూ తిరుగుతుండడంతో ఏమి దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితురాలు మియాపూర్ పోలీసులను ఆశ్రయించారు. ఆధారాలు అన్ని పరిశీలించిన పోలీసులు ఢీ డ్యాన్సర్ రాజుపై సెక్షన్ 69, 318(4) బి.ఎన్.ఎస్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు రాజుని అరెస్ట్ చేసి జ్యుడీషియలర్ రిమాండ్‌కి తరలించారు. ఈ కేసుతో మూడు నెలలు పాటు రాజు జైల్లో ఉండే అవకాశం ఉంది.