Yad Bhavam Tad Bhavathi : లగడపాటి శ్రీధర్ చేతుల మీదుగా 'యద్భావం తద్భవతి' టీజర్
ABN, Publish Date - Nov 06 , 2026 | 11:17 AM
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నచిత్రం 'యద్భావం తద్భవతి'. ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు.
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్నచిత్రం 'యద్భావం తద్భవతి'. ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "యద్భావం తద్భవతి' టీజర్, ఒక పాట కూడా చూసాను. చాలా గ్రాండ్ గా ఉన్నాయి చిన్న సినిమా అయినప్పటికీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. రమేష్ జక్కల గారి దర్శకత్వం, మిహిరామ్ సంగీతం బాగున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కళ పట్ల ఉన్న అభిమానంతో సినిమా తీయడం చాలా పెద్ద విషయం. ఈ సినిమా చక్కని విజయం సాధించాలి' అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు మిహిరామ్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు కాబోయే భార్య పేరు ఇదే..
చిరంజీవి ‘మెగావర్స్’లో సందడి చేయనున్న స్టార్స్ వీరేనా?
సుడిగాలి సుధీర్ GOAT ట్రైలర్ వదిలిన దుల్కర్.. ఎలా ఉందంటే?