ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలి
ABN, Publish Date - Mar 21 , 2026 | 06:21 AM
తెలుగు సినీ రంగంలో తనదైన సినిమాలతో ఓ మంచి పేరు తెచ్చుకుంది అచ్చ తెలుగు నటి ఈషా రెబ్బ.
తెలుగు సినీ రంగంలో తనదైన సినిమాలతో ఓ మంచి పేరు తెచ్చుకుంది అచ్చ తెలుగు నటి ఈషా రెబ్బ. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దశాబ్దానికి పైగా పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ కేవలం దక్షిణాది చిత్రాలకే పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాత్రల విషయంలో ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.
ఇటీవలే త్రీ రోజెస్ సీజన్ 2, ఓం శాంతి శాంతి శాంతిహి చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ తాజాగా విశాఖలో సందడి చేసింది. గాజువాకలో ప్రముఖ వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్’ తన నూతన బ్రాంచ్ ‘కలర్స్ 2.0’ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు.
ఇక ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం జీవితంలో కీలకమని చెప్పారు. ఆరోగ్యంగా ఉంటేనే సహజ అందం వెలుగులోకి వస్తుందని, అందుకే యువత సరైన ఆహారం, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం తాను రెండు సినిమాల్లో నటిస్తున్నానని వెల్లడించారు. కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, గాజువాకలో ఈ సెంటర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.