Zareena Wahab: జరీనా వహాబ్ ‘తు బేఖబర్’.. త్వరలో ఓటీటీ ప్రీమియర్ 

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:14 PM

సీనియర్ నటి జరీనా వహాబ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తు బేఖబర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

సీనియర్ నటి జరీనా వహాబ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తు బేఖబర్’ (Zareena Wahab) సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రముఖ ఓటీటీ వేదికపై ఈ చిత్రం ప్రీమియర్‌గా విడుదల కానుంది. దీపక్ బల్‌దేవ్ ఠాకూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డి. దినకర్ నాయుడు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సమకాలీన సామాజిక సమస్యల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సందేశాన్ని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు. .ఇందులో జరీనా వహాబ్‌తో పాటు మధు నంబియార్, పవన్ కుమార్, హేమ గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.ఎల్. బాబు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంజీవ్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవల ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’  చిత్రాల్లో  జరీనా వహాబ్ నటించారు. ఇప్పుడు ‘తు బేఖబర్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీతో పాటు  టీజర్ విడుదల  వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ALSO READ:
Jailer 2: 40 ఏళ్ల తర్వాత.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన రజనీ

యోగిబాబు ‘సింగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్ 30న థియేటర్లలోకి!

Sai Durga Tej: సాయితేజ్‌ సినిమాలో కాంతార భామ

Updated Date - Oct 25 , 2026 | 12:31 PM