సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రావణుడి పాత్ర.. కొడుకు వేసిన ప్రశ్నకి ఆశ్చర్యపోయిన యశ్

ABN, Publish Date - Oct 31 , 2026 | 07:37 PM

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash), బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ విజువల్ వండర్ చిత్రం 'రామాయణం' (Ramayana).

Ramayana

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash), బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ బడ్జెట్ విజువల్ వండర్ చిత్రం 'రామాయణం' (Ramayana). ఈ ప్రతిష్ఠాత్మక ఇతిహాస చిత్రంలో యశ్ రాక్షసరాజు రావణాసురుడి పాత్రలో నటిస్తుండటమే కాకుండా, తన సొంత బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో కలిసి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వంలో అత్యంత సాంకేతిక విలువలతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఇతిహాస చిత్రంలో తొలి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు.


తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్న యశ్, తాను రావణాసురుడి పాత్ర పోషిస్తున్నట్లు తన కుమారుడికి చెప్పినప్పుడు ఎదురైన వింత అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. యశ్ కి ఒక కుమార్తె ఐరా, కుమారుడు యథర్వ్. ఈ సినిమా ఒప్పుకున్నాక యథర్వ్ తో తాను రావణుడి పాత్ర చేస్తున్నట్లు చెప్పాడట. 'రామాయణ కథ చెప్పి, అందులో నేను రావణుడి పాత్ర చేస్తున్నానని చెప్పగానే నా కొడుకు నమ్మలేకపోయాడు. నో.. నాన్న నువ్వు చెడ్డవాడి పాత్ర ఎందుకు చేస్తున్నావు? అలా ఎలా చేస్తావు? అని ప్రశ్నించాడు. ఈ కథలో మనందరికీ ఆదర్శం శ్రీరాముడు మాత్రమే. రావణుడు గొప్పగా, శక్తిమంతంగా కనిపించినప్పటికీ.. జీవితంలో ధర్మం, విజయం సాధించాలంటే రాముడి మార్గంలోనే నడవాలని వివరించాను. థియేటర్‌లో ఒక నటుడిగా నన్ను చూసి నువ్వు చప్పట్లు కొట్టొచ్చు, కానీ ఆ రావణుడి పాత్రను మాత్రం ఆదర్శంగా తీసుకోకూడదని చెప్పాను" అని వెల్లడించాడు.


అయితే ఆ సంభాషణ అంతటితో ఆగలేదని.. 'సినిమా చివర్లో నువ్వు యుద్ధంలో ఓడిపోయి చనిపోతావా?' అని తన కుమారుడు ఊహించని ప్రశ్న అడిగాడని, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం కాస్త కష్టంగా అనిపించినా, నటుడిగా పాత్రలోని వేర్వేరు కోణాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం ఒక అరుదైన అనుభవమని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి రామాయణతో యశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Oct 31 , 2026 | 07:37 PM