సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: బాలీవుడ్ అన్ని ఉత్తమ చిత్రాలే తీసిందా.. పెద్ది పై ఎందుకంత..

ABN, Publish Date - Jun 08 , 2026 | 06:47 AM

సౌత్‌ సినిమా అంటే బాలీవుడ్‌కు ఒకప్పుడు చిన్నచూపు. ఇప్పుడు ఈర్ష్య, ద్వేషం. అందుకు కారణం. కొన్నేళ్లగా టాలీవుడ్‌ సాధిస్తున్న రికార్డులు, గ్లోబల్‌ స్థాయిలో దక్కుతున్న ఆదరణ చూసి బాలీవుడ్‌ వర్గాల్లో  కడుపుమంట ఉందనేది అందరికీ తెలిసిందే!

Peddi -Bollywood

సౌత్‌ సినిమా అంటే బాలీవుడ్‌కు ఒకప్పుడు చిన్నచూపు. ఇప్పుడు ఈర్ష్య, ద్వేషం. అందుకు కారణం. కొన్నేళ్లగా టాలీవుడ్‌ సాధిస్తున్న రికార్డులు, గ్లోబల్‌ స్థాయిలో దక్కుతున్న ఆదరణ చూసి బాలీవుడ్‌ (Bollywood) వర్గాల్లో  కడుపుమంట ఉందనేది అందరికీ తెలిసిందే! బాలీవుడ్‌లో అప్పుడప్పుడు కంటెంట్‌ ఉన్న చిత్రాలొస్తాయి.  మిగతావన్నీ కమర్షియల్‌, గ్లామర్‌ చిత్రాలే! కంటెంట్‌ పరంగా సౌత్‌ సినిమాతో పోటీ పడలేని పరిస్థితి ఉత్తరాది సినిమాది. అందుకే మన చిత్రాల్లో చిన్నచిన్న లోపాలను వేలెత్తి చూపించడం, అక్కడి కొందరు సెలబ్రిటీలకు, ముఖ్యంగా బాలీవుడ్‌ మీడియాకు పరిపాటి అయిపోయింది. తాజాగా రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విషయంలో హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ పోషించిన పాత్ర గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే! అచ్చియమ్మ పాత్రను ఓవర్‌ గ్లామర్‌గా చిత్రీకరించారని, కొన్ని సన్నివేశాలైతే అభ్యంతరకరంగా ఉన్నాయని బాలీవుడ్‌కు చెందిన ఓ బ్యాచ్‌, సంబంధిత సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా విమర్శల దాడికి దిగింది.




అయితే సినిమాలో జాన్వీ పాత్రపై కొందరు చేసిన విమర్శలను, సూచించిన సలహాలను దర్శకుడు పాజిటివ్‌గా తీసుకున్నారు. సారీ చెబుతూ వాటిని మార్చే ప్రయత్నం చేస్తానని మాటిచ్చారు. సోషల్‌ మీడియా, ఉత్తరాది పొలిటికల్‌, సినీ వర్గాల నుంచి వచ్చిన విమర్శలకు భయపడి ఆయన వివాదాస్పద సన్నివేశాలను తొలగిస్తామని ప్రకటించి క్షమాపణలు తెలిపారు. బుచ్చిబాబు సారీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. క్రియేటివ్‌ ఫీల్డ్‌లో ఇదంతా సహజం. అయితే బుచ్చి సారీ చెప్పడంతో తాను నమ్మి తీసిన సీన్లపై ఇంత త్వరగా కాంప్రమైజ్‌ కావడం, తానేదో తప్పు చేశానని ఒప్పుకున్నట్లు అయింది. అప్పటి వరకూ ఈ ఇష్యూ సోషల్‌ మీడియాలో మాత్రమే తిరిగింది. బుచ్చిబాబు లెటర్‌ విడుదల చేయడంతో ఇప్పుడు కొందరు విమర్శకులు మరింత బరితెగించి ఈ సినిమాపై, టాలీవుడ్‌ మేకింగ్‌ స్టైల్‌పై రాళ్లు విసరడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడి ప్రేక్షకుల్లో బాలీవుడ్‌పై ప్రతిదాడి చేసేవారు కూడా ఉన్నారు. టాలీవుడ్‌ సినిమాలకు పేరు పెట్టే ముందు బాలీవుడ్‌ నుంచి ఎలాంటి చిత్రాలు వస్తున్నాయో గమనించుకోండి? అంటూ సోషల్‌ మీడియాలో తెలుగు సినీ ప్రియులు సవాల్‌ విసురుతున్నారు. హిందీ చిత్ర పరిశ్రమ మహిళలను పతివ్రతలుగానే చూపిస్తోందా? బాలీవుడ్‌లో మహిళలను అన్నీ గౌరవమైన పాత్రలే దక్కుతున్నాయా? అని ప్రశ్నిస్తున్నారు.


ఇండియన్‌ సినిమా హిస్టరీలో హీరోయిన్లను కేవలం గ్లామర్‌ డాల్స్‌గా మార్చింది బాలీవుడ్‌.. పొట్టి దుస్తులతో ఐటెం సాంగ్స్‌ సంస్కృతిని పెంచి పోషించింది బాలీవుడ్డే అంటూ మండిపడుతున్నారు. కొన్ని హిందీ చిత్రాల్లో అయితే మహిళల పాత్రలను ఎంత దారుణంగా చిత్రీకరించారో జనాలకు తెలుసు. అచ్చియమ్మ పాత్రకంటే ఉత్తరాది సినిమాల్లో ఘోరమైన, అసభ్యకరమైన  ముద్దు సీన్లు, అభ్యంతరకర సన్నివేశాలు ఉండే అడల్ట్‌ కంటెంట్‌ ఉన్నప్పుడు నోరు విప్పని నేషనల్‌ మీడియా ఒక దక్షిణాది సినిమాకు వచ్చేసరికి ఆరోగ్య సూత్రాలు చెప్పినట్లు ప్రసారాలు చేయడం వంద శాతం కడుపుమంటతో చేసిన పనే అని అర్థమవుతోంది అంటూ పోస్టులు పెడుతున్నారు. ఎవరు ఏమీ చేసినా, ఎంత ట్రోలింగ్‌ జరిగినా టాలీవుడ్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో తిష్ట వేసుకుని కూర్చుంది. దానిని డామినేట్‌ చేయాలని, తెలుగు సినిమా పరువును దిగజార్చాలని చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ అని మండిపడుతున్నారు దక్షిణాది ప్రేక్షకులు.

ఇవి కూడా చదవండి:

ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

Updated Date - Jun 08 , 2026 | 11:26 AM