సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘రామాయణ’.. అంత‌ రేటు తగ్గడానికి కారణం ఏమిటి?

ABN, Publish Date - Jul 08 , 2026 | 07:31 AM

భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి.

Ramayana Movie

భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో ‘రామాయణ’ (Ramayana) ఒకటి. రణబీర్‌ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, సాయిపల్లవి (Sai Pallavi) సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళి సందర్భంగా అక్టోబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఓ దృశ్య కావ్యంలా ఈ సినిమాను తీర్చిదిద్దడం కోసం దర్శకుడు నితీశ్‌ తివారి (Nitesh Tiwari) కృషి చేస్తున్నారు. మరో పక్క నిర్మాతలు నమిత్‌ మల్హోత్రా, నటుడు యశ్‌ వ్యాపార వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు.

రూ. 4 వేల కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా అత్యంత భారీ ఎత్తున తయారవుతున్న ‘రామాయణ’ చిత్రాన్ని అదే స్థాయిలో అమ్మాలని నిర్మాతల ప్రయత్నం. ఇందులో భాగంగా సినిమాలోని కొన్ని ముఖ్య సన్నివేశాలను ఎడిట్‌ చేసి 30 నిముషాల వీడియో తయారు చేసి లీడింగ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌కు చూపించారు నమిత్‌ మల్హోత్రా (Namit Malhotra). దేశవ్యాప్తంగా రూ 500 కోట్లు పంపిణీదారుల నుంచి రాబట్డాలని ఆయన ప్రయత్నం. అయితే అంత భారీ రేటు చెబుతుండడంతో పంపిణీదారులు వెనుకంజ వేస్తున్నారని, తగ్గించి ఇస్తే తీసుకోవడానికి సిద్ధమని చెప్పారని వార్తలు వచ్చాయి.

అయితే దర్శక నిర్మాత, పంపిణీదారుడు కరణ్‌ జోహార్‌ ఓ అడుగు ముందుకు వేసి, నమిత్‌ మల్హోత్రాతో మాట్లాడి, చివరకు రూ 250 కోట్లకు డీల్‌ ఓకే చేసుకున్నారని సమాచారం. అంత రేటు చెప్పి చివరికి సగానికి సగం తగ్గించి కరణ్‌ జోహర్‌కు ఇవ్వడానికి కారణం ఆయన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌కు ఉన్న గుడ్‌విల్‌, సినిమాను జనంలోకి తీసుకు వెళ్లగల సత్తా ఉంది కనుక నిర్మాత నమిత్‌ మల్హోత్రా రేటు తగ్గించారని అంటున్నారు. మొదటి భాగం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘రామాయణ’ కోసం ఒక పక్క పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తూనే, రెండో భాగం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2026 | 07:59 AM