సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

50 ఏళ్ల మహిళగా వామికా గబ్బి.. గుర్తుపట్టలేనంతగా మేకోవర్!

ABN, Publish Date - Oct 28 , 2026 | 03:54 PM

వామికా గబ్బి తాజా హిందీ చిత్రం ప్రహార్‌లో 50 ఏళ్ల మహిళగా జ్యోతి పాత్రలో నటించింది. ప్రోస్తటిక్ మేకప్‌తో గుర్తుపట్టలేని విధంగా మారిన ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Wamiqa Gabbi

వైవిధ్యమైన పాత్రలకు ఇప్పుడు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది వామికా గబ్బి. తెలుగులో 'భలే మంచిరోజు, నన్ను వదిలి నీవు పోలేవులే' చిత్రాలలో నటించిన వామికా గబ్బి ప్రస్తుతం అడివి శేష్‌ 'జి 2'లో నటిస్తోంది. ఈ యేడాది ఆమెకు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. వామికా నటించిన నాలుగు సినిమాలు ఈ సంవత్సరం ఇంతవరకూ విడుదలయ్యాయి. ఏప్రిల్‌లో వచ్చిన 'భూత్ బంగ్లా' చక్కని విజయం సాధించగా, 'పతి పత్నీ అవుర్‌ వో దో' సినిమా యావరేజ్‌ గా ఆడింది. ఇక వామిక నటించిన తమిళ చిత్రం 'డీసీ' ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు లోకేశ్‌ కనగరాజు హీరోగా పరిచయం అయ్యాడు.


వామిక నటించిన తాజా హిందీ చిత్రం 'ప్రహార్‌' సైతం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 33 సంవత్సరాల వామికా గబ్బి ఈ సినిమాలో యాభై యేళ్ళ మహిళగా నటించడం విశేషం. అందుకోసం ఆమెకు పోస్తటిక్‌ మేకప్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను వామికా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జ్యోతి అనే ఈ పాత్రద్వారా తనకు ఎన్నో కొత్త విషయాలు బోధపడ్డాయని, పూర్తిగా మేకప్ అయిన తర్వాత తనను తాను గుర్తు పట్టలేకపోయానని వామికా గబ్బి తెలిపింది. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ, హిందీ, పంజాబీ భాషా చిత్రాలలో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి:

Nayanthara: 60 అడుగులతో.. నయనతార భారీ కటౌట్

అబ్సెషన్.. తెలుగు ఏం పాపం చేసింది

ఏం జరుగుతోందిరా.. శ్రీనిధి కాళ్లు మొక్కిన త్రివిక్రమ్

Updated Date - Oct 28 , 2026 | 04:04 PM