సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బయోపిక్‌ కాదు.. మాల్యా జీవిత స్ఫూర్తితో ‘బిలియనీర్‌’ వెబ్‌ సిరీస్‌

ABN, Publish Date - Sep 01 , 2026 | 10:05 AM

వ్యాపారవేత్తల్లో ఓ సంచలనం సృష్టించిన విజయ్‌ మాల్యా ప్రయాణం ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ‘బిలియనీర్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

వ్యాపారవేత్తల్లో ఓ సంచలనం సృష్టించిన విజయ్‌ మాల్యా (Vijay Malya) ప్రయాణం ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ‘బిలియనీర్‌’(Billionaire)పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ను విజయ్‌ మాల్యాకు సంబందించిన  బయోపిక్‌గా భావించాల్సిన అవసరం లేదని మేకర్స్‌ చెబుతున్నారు. మాల్యా వ్యాపార ప్రయాణం, ఆయన ఎదుగుదల, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నుంచి స్ఫూర్తి తీసుకుని కథను కల్పిత రూపంలో రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.  సంపదతో పాటు పలుకుబడిని పెంచుకుంటూ తనదైన ప్రపంచాన్ని నిర్మించుకునే ఆ వ్యక్తి.. ఆశయం, అధికారం, విజయాల వెంట పరుగెత్తే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లను కథలో ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అతని నిర్ణయాలు వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయనే అంశం సిరీస్‌లో కీలకంగా ఉండనుంది.

సంపద పెరిగేకొద్దీ పెరిగే ఆశలు, పలుకుబడితో మారే వ్యక్తిత్వం, వ్యాపార నిర్ణయాల ప్రభావం, కుటుంబ సంబంధాల్లో వచ్చే మార్పులు.. చివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతడి సామ్రాజ్యాన్నే ఎలా కుదిపేశాయనే అంశాలను డ్రామాటిక్‌గా చూపించనున్నారట. అందువల్ల ఇది కేవలం ఓ వ్యాపారవేత్త కథగా కాకుండా అధికారం, ఆశ, విజయంతో పాటు పతనం చుట్టూ తిరిగే కథగా ఉండబోతుందని సమాచారం.  ‘బిలియనీర్‌’కు హన్సల్‌ మెహతా, రాబీ గ్రెవాల్‌ దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథలను సహజమైన పాత్రలతో, బలమైన డ్రామాతో చెప్పడంలో హన్సల్‌ మెహతాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిరీస్‌ ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 2026లో షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇతర నటీనటులు, ఎపిసోడ్ల సంఖ్య, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌, విడుదల తేదీ వంటి వివరాలను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మాల్యా జీవితంపై ఇప్పటికే డాక్యుమెంటరీలు, పలు కథనాలు వచ్చిన నేపథ్యంలో ‘బిలియనీర్‌’ను మాత్రం అదే కథను మళ్లీ చెప్పే ప్రాజెక్ట్‌గా కాకుండా.. ఆ ప్రపంచం నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత కథగా రూపొందించడం ఆసక్తికరంగా మారింది.

వ్యాపారవేత్తల్లో ఓ సంచలనం సృష్టించిన విజయ్‌ మాల్యా ప్రయాణం ఆధారంగా ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ‘బిలియనీర్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ను విజయ్‌ మాల్యాకు సంబందించిన  బయోపిక్‌గా భావించాల్సిన అవసరం లేదని మేకర్స్‌ చెబుతున్నారు. మాల్యా వ్యాపార ప్రయాణం, ఆయన ఎదుగుదల, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నుంచి స్ఫూర్తి తీసుకుని కథను కల్పిత రూపంలో రూపొందిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.  సంపదతో పాటు పలుకుబడిని పెంచుకుంటూ తనదైన ప్రపంచాన్ని నిర్మించుకునే ఆ వ్యక్తి.. ఆశయం, అధికారం, విజయాల వెంట పరుగెత్తే క్రమంలో ఎదుర్కొనే సవాళ్లను కథలో ప్రధానంగా చూపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా అతని నిర్ణయాలు వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాయనే అంశం సిరీస్‌లో కీలకంగా ఉండనుంది.

సంపద పెరిగేకొద్దీ పెరిగే ఆశలు, పలుకుబడితో మారే వ్యక్తిత్వం, వ్యాపార నిర్ణయాల ప్రభావం, కుటుంబ సంబంధాల్లో వచ్చే మార్పులు.. చివరకు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అతడి సామ్రాజ్యాన్నే ఎలా కుదిపేశాయనే అంశాలను డ్రామాటిక్‌గా చూపించనున్నారట. అందువల్ల ఇది కేవలం ఓ వ్యాపారవేత్త కథగా కాకుండా అధికారం, ఆశ, విజయంతో పాటు పతనం చుట్టూ తిరిగే కథగా ఉండబోతుందని సమాచారం.  ‘బిలియనీర్‌’కు హన్సల్‌ మెహతా, రాబీ గ్రెవాల్‌ దర్శకత్వం వహించనున్నారు. వాస్తవ ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథలను సహజమైన పాత్రలతో, బలమైన డ్రామాతో చెప్పడంలో హన్సల్‌ మెహతాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సిరీస్‌ ప్రీ-ప్రొడక్షన్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 2026లో షూటింగ్‌ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఇతర నటీనటులు, ఎపిసోడ్ల సంఖ్య, స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌, విడుదల తేదీ వంటి వివరాలను మేకర్స్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మాల్యా జీవితంపై ఇప్పటికే డాక్యుమెంటరీలు, పలు కథనాలు వచ్చిన నేపథ్యంలో ‘బిలియనీర్‌’ను మాత్రం అదే కథను మళ్లీ చెప్పే ప్రాజెక్ట్‌గా కాకుండా.. ఆ ప్రపంచం నుంచి స్ఫూర్తి పొందిన కల్పిత కథగా రూపొందించడం ఆసక్తికరంగా మారింది.

ALSO READ: రంభలో ఆ జోష్‌ ఇంకా తగ్గలేదే.. తలకు టవల్‌తో ఫుల్ ఎనర్జీ డ్యాన్స్‌!

శివన్నలో మరో యాంగిల్.. ఆసక్తికరంగా ‘కూర్మ అవతార్‌’ టీజర్ 

Nag Ashwin: ప్రభాస్‌ ‘కల్కి 2’ షూటింగ్ పై దర్శకుడు నాగ్ అశ్విన్‌ క్లారిటీ..

Updated Date - Sep 01 , 2026 | 10:43 AM