Love and war: లవ్ అండ్ వార్‌.. విక్కీ కౌశల్.. ఇంటెన్స్ లుక్‌

ABN , Publish Date - Sep 26 , 2026 | 03:24 PM

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

బాలీవుడ్‌లో ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ అండ్ వార్’ (love and war) . సంజయ్ లీలా భన్సాలీ (Sanjay leela bhansali) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ తొలిసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ కాంబినేషన్ తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్‌లను విడుదల చేసిన చిత్రబృందం.. తాజాగా విక్కీ కౌశల్ పాత్రను పరిచయం చేస్తూ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ విడుదలైన క్షణాల్లోనే  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విక్కీ కౌశల్‌ను ఇంతకుముందెన్నడూ చూడని విధంగా భన్సాలీ ఈ పోస్టర్‌లో ప్రజెంట్ చేశారు. చేతిలో సిగరెట్, లైటర్ పట్టుకుని ఎంతో గంభీరంగా, ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. ఆయన చూపుల్లోని తీవ్రత, స్టైలిష్ అప్పియరెన్స్, ఎక్స్‌ప్రెషన్‌.. పాత్రపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. రణ్‌బీర్, అలియా, విక్కీ ముగ్గురినీ మూడు విభిన్నమైన షేడ్స్‌లో పరిచయం చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.   ఈ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. 

ఇవి కూడా చదవండి:

ఇక నో డౌట్.. ‘రణబాలి’ వచ్చేది ఫిక్స్.. న్యూ పోస్టర్ వైరల్

సల్మాన్ ఖాన్ ‘మాన్‌స్టర్’.. మైండ్‌ బ్లోయింగ్‌ డీల్‌!

గతేడాది ఇదే టైమ్‌కి థియేటర్లలో ఫైర్ స్ట్రోమ్: సుజీత్ పోస్ట్ వైరల్

Updated Date - Sep 26 , 2026 | 03:30 PM