The Vvaan: ఈ సారి తమన్నా హిట్టు కొట్టేట్టుంది!
ABN, Publish Date - Sep 16 , 2026 | 04:56 PM
తమన్నా తాజా చిత్రం 'ద వన్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. నాస్తికుడిగా ఉన్న హీరో ఆస్తికుడిగా మారిన వైనం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.
పాన్ ఇండియా స్టార్, మిల్కీబ్యూటీ తమన్నా గత కొంతకాలంగా ఐటమ్ సాంగ్స్ కు పరిమితం అయిపోయింది. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తే సినిమా సూపర్ హిట్ అనే టాక్ కూడా వచ్చింది. అయితే ఆమె సోలో హీరోయిన్ గా నటించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ బరిలో వండర్స్ క్రియేట్ చేయలేకపోయాయి. తెలుగులో తమన్నా ఆ మధ్య 'ఓదెల 2'లో నటించింది. అందులో నాగ సాధు పాత్రను తమన్నా పోషించింది. శివ భక్తురాలైన ఆ పాత్ర నటిగా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది కానీ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు.
తాజాగా తమన్నా నటించిన మరో సినిమా 'ద వన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్' ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ ఫాంటసీ డివోషనల్ థ్రిల్లర్ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా నటించగా, అనూప్ సోని, సునీల్ గ్రోవర్, శ్వేత తివారి, మనీశ్ పాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ జానపదగాథల ఆధారంగా ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ మూవీని దీపక్ కుమార్ మిశ్రా రూపొందించారు. శోభా కపూర్, ఏక్తా కపూర్ దీనిని నిర్మిస్తున్నారు. దైవశక్తిని విశ్వసించని హీరో చివరకు ఆ అనుభవాన్ని ఎలా పొందాడు, అందుకు కథానాయిక ఎలాంటి సహకారం అందించింది, సూర్యాస్తమయం తర్వాత వెళ్ళకూడని ఆ దట్టమైన అడవిలో అసలు ఏం ఉంది? అనే ఉత్సుకతను ఈ సినిమా ట్రైలర్ కలిగిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపుదిద్దుకున్న 'ద వన్' మూవీ మంచి విజయాన్ని సాధించే ఆస్కారం ఉంది. తెలుగులో వచ్చిన 'ఇరుముడి' ఘన విజయం సాధించినట్టుగానే, హిందీలో వచ్చిన డివోషనల్ మూవీ 'హనుమాన్ అంశ్' కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వస్తున్న 'ద వన్' కూడా విజయపథంలో సాగేలా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి!
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న సూరి, సుహాస్.. ‘మండాడి’ కలెక్షన్ల సునామీ
నాడు అడుగేస్తే చప్పట్లు.. నేడు జైలులో ఊచలు
'కిల్లర్' మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్!