సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సన్నీ డియోల్‌ ‘సూర్య’కు చిక్కులు... విడుదల వాయిదా!

ABN, Publish Date - Nov 16 , 2026 | 01:49 PM

సన్నీ డియోల్‌ నటించిన ‘సూర్య: అంత్‌ సే ఆరంభ్‌ తక్’ సినిమాపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. వైద్యులపై హింసను ప్రోత్సహించేలా టీజర్ ఉందని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నవంబర్ 20న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడగా, జనవరి 15న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Sunny Deol Surya Movie

బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ హీరో సన్నీ డియోల్‌ తాజా చిత్రం చిక్కుల్లో పడింది. ఆయన నటించిన 'సూర్య: అంత్‌ సే ఆరంభ్ తక్' మూవీ ఈ నెల 20న విడుదల కావాల్సింది. సన్నీ డియోల్‌ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 19న ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్‌ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమా వివాదానికి తెరలేపినట్టయ్యింది. ఈ సినిమా వైద్యులపై హింసను ప్రోత్సహించేలా ఉందని, డాక్టర్లను మేకర్స్ చెడుగా చూపించే ప్రయత్నం చేశారని ఇండియన్ మెడికల్‌ అసోసియేషన్‌ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు, సమాచార ప్రసార శాఖకు ఫిర్యాదు చేసింది. వైద్య వృత్తిలో అవినీతి సర్వసాధారణం అనేలా ఈ టీజర్‌ ఉందని, హెల్త్ కేర్‌ వర్కర్లపై హింసను ప్రేరేపిస్తోందని, దీని కారణంగా వైద్యులపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతినే ఆస్కారముందని ఇండియన్ మెడికల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అనిల్‌ కుమార్ జె నాయక్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీజర్‌పై నిష్పాక్షిక సమీక్ష జరిపి, మేకర్స్ నుంచి వివరణ తీసుకోవాల్సిందిగా కోరారు.


ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ నుంచి వచ్చిన ఈ ఎదురు దెబ్బను ఊహించని దర్శక నిర్మాతలు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. అయితే ఇదంతా సమయంతో కూడుకన్న వ్యవహారం కావడంతో ముందు సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అందుల్లో నవంబర్‌ 20న 'సూర్య: అంత్‌ సే ఆరంభ్ తక్' విడుదల కావడం లేదు. అయితే వీలైనంత త్వరగా అడ్డంకులు తొలగించుకున్నా... డిసెంబర్‌లో భారీ పాన్ ఇండియా సినిమాలు, ఆంగ్ల చిత్రాలు ఉండటంతో దీన్ని జనవరికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్న విధంగా జరిగి, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయితే, జనవరి 15న 'సూర్య: అంత్‌ సే ఆరంభ్‌ తక్'ను విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో సన్నీడియోల్ తో పాటు రవికిషన్‌, ప్రగ్యా జైస్వాల్‌, జిష్ణుసేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎం. పద్మకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.


మరో విశేషం ఏమంటే... దాదాపు 19 సంవత్సరాల తర్వాత సన్నీడియోల్ నటించిన నాలుగు సినిమాలు ఒకే యేడాది విడుదలైనట్టైంది. 2007లో సన్నీ నటించిన 'బిగ్ బ్రదర్, ఫూల్‌ ఎన్‌ ఫైనల్‌, అప్నే, కాఫిలా' సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఈ యేడాది సన్నీడియోల్‌ నటించిన 'బోర్డర్‌ 2, బట్వారా 1947' థియేటర్లలో విడుదల కాగా, 'ఇక్కా' మూవీ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అయ్యింది. అలానే సన్నీ డియోల్‌ పూర్తి స్థాయిలో కనిపించకపోయినా సినిమా చివరిలో గ్లింప్స్ రూపంలో కనిపించిన 'రామాయణం' కూడా ఇదే యేడాది వచ్చింది. ఈ సినిమా ప్రచారంలోనూ సన్నీడియోల్‌ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ రకంగా ఆయన నటించిన సినిమాలు నాలుగు వచ్చాయనే భావించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

తనిష్క్ దోపిడీ.. అరెస్టు తర్వాత పెరిగిన యూట్యూబర్ మీనాక్షి ఫాలోవర్స్

Ashika Ranganath: అల్లు అర్జున్ తో పని చేయడం చాలా బావుంది

కాకా.. వెంకటేష్ హీరోయిన్ తో చిరు స్టెప్పులు

Updated Date - Nov 16 , 2026 | 01:57 PM