విడుదలైన శ్రీవాస్ 'ఫీనిక్స్ రాజా' 2డీ టీజర్
ABN, Publish Date - Aug 28 , 2026 | 12:07 PM
మూడేళ్ళ క్రితం గోపీచంద్ హీరోగా 'రామబాణం' చిత్రం తెరకెక్కించిన శ్రీవాస్ ఇప్పుడు 'ఫీనిక్స్ రాజా' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ముంబైలో చేశారు.
ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ తన ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ప్రకటించారు. మహంకాళి నాగరాజు నిర్మాణంలో, మాధవి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘ఫీనిక్స్ రాజా’ అనే టైటిల్ ఖరారు చేశారు. అరిగపూడి సుమిత్ కుమార్, శైలేష్ భంబురే, శ్యామ్ బొడపాటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ముంబైలోని జుహూలో నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘ఫీనిక్స్ రాజా’ ఫస్ట్ పోస్టర్‌తో పాటు రెండు నిమిషాల పవర్‌ఫుల్ 2డీ మోషన్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ ప్రమోషనల్ కంటెంట్‌ను కార్యక్రమానికి హాజరైన మీడియా ప్రతినిధుల చేతుల మీదు గానే ఆవిష్కరించారు. ఇంగ్లిష్‌తో పాటు పలు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారత్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లోనూ భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. వాస్తవ సంఘటనలను, ప్రభావవంతమైన కథనంతో చూపిస్తూ కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడమే లక్ష్యంగా సినిమా రూపొందిస్తున్నట్లు దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.
‘ఫీనిక్స్ రాజా’ కథ గురించి ఆయన చెబుతూ, 'ఇదో నిజాయితీగల వ్యాపారవేత్త చుట్టూ తిరుగుతుంది. రాజకీయ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించుకోకుండా కష్టపడి, విలువలు, నిజాయితీతో జీవితాన్ని నిర్మించుకోవాలని భావించే అతడి జీవితంలోకి పవర్ ఫుల్ వ్యక్తులు ప్రవేశించినప్పుడు.. అతడి వ్యక్తిగత పోరాటం కాస్తా నిజం, గౌరవం, భవిష్యత్ తరాల కోసం జరిగే పెద్ద పోరాటంగా మారుతుంది' అని అన్నారు. ఈ చిత్రంలో మరో కీలక అంశంగా జెన్‌జీపై డ్రగ్ మాఫియా పెరుగుతున్న ప్రభావాన్ని చూపించనున్నారు. 'జెన్‌జీ భవిష్యత్తును నియంత్రించగలిగితే... రేపటిని ఎవరు నియంత్రిస్తారు?'అనే ప్రశ్నను సినిమా లేవనెత్తనుంది. అధికారం, రాజకీయాలు, డ్రగ్ నెట్‌వర్క్, న్యాయ వ్యవస్థ చుట్టూఈ కథ సాగనుంది.ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం, ఇతర నిర్మాణ వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
ఇవి కూడా చదవండి:
మరోసారి దిల్ రాజు Vs మైత్రీ! ఈసారి ఏమయ్యేనో
Varun Tej: 'బరి’ పై వరుణ్ తేజ్ ఫోకస్.. ఈసారి గెలుపే టార్గెట్!