సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫర్జీ2.. ఆట మళ్లీ మొదలు

ABN, Publish Date - Feb 10 , 2026 | 09:50 PM

ద మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ అప్‌డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ తెచ్చేసింది.

farzi

ది మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ అప్‌డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ తెచ్చేసింది. రెండేండ్ల క్రితం బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ (Shahid Kapoor) ఓటీటీ డెబ్యూ చేసిన వెబ్ సిరీస్ ఫర్జీ (Farzi) భారీ హిట్ అయింది. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఇది రికార్డు స్థాయి వ్యూవర్‌షిప్ సాధించింది. దీంతో అభిమానులు సీజన్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా రాజ్ & డీకే సోషల్ మీడియాలో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు.

'ఫర్జీ సీజన్ 2' ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో జరుగుతోందని రాజ్ & డీకే తెలిపారు. తాజాగా ఒక ఫొటో షేర్ చేసి “Round 2 in progress” అని క్యాప్షన్ పెట్టారు. ఇది ఫ్యాన్స్‌ను ఖుషి చేసింది. 'ఫర్జీ సీజన్ 2' షూటింగ్ మార్చి మొదలు కానుంది. అయితే ఈ ఏడాది చివరల్లో లేదా వచ్చే ఏడాదిలో స్ట్రీమింగ్‌‌కు ప్లాన్ చేస్తున్నారట.

మొదటి సీజన్ లాగే ఈ సీజన్ పై కూడా ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. షాహిద్ కపూర్ 'సన్నీ' పాత్రలో మళ్లీ కనిపించనున్నారు. విజయ్ సేతుపతి, కే కే మేనన్ కూడా తిరిగి రానున్నారు. మొత్తంగా చూస్తే.. ఫర్జీ సీజన్ 2 (Farzi Season 2’) తో మళ్లీ ఒక భారీ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సిరీస్‌లో విజ‌య్ సేతుప‌తి, రాశి ఖ‌న్నా వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా ది ఫ్యామిలీమెన్ ఫేమ్ రాజ్ డీకే త్ర‌యం తెర‌కెక్కిస్తోంది.

Updated Date - Feb 10 , 2026 | 10:06 PM