ఆ ఆరోపణల్లో నిజం లేదు!

ABN , Publish Date - Sep 16 , 2026 | 03:33 PM

సల్మాన్ ఖాన్ నటించి, నిర్మిస్తున్న 'మాతృభూమి' తుదిమెరుగులు దిద్దుకుంటోంది. భారత్‌ - చైనా సరిహద్దుల్లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Matrubumi movie

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమౌతున్నాడు. అంతేకాదు... సెట్స్ మీద ఉన్న సినిమాలు సైతం రకరకాల కారణాలతో అనుకున్న సమయానికి విడుదల కావడం లేదు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ హీరోగా అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'ది బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్‌' మూవీ టైటిల్‌ను ఇప్పటికే మార్చేశారు. ఇప్పుడు ఆ సినిమాకు 'మాతృభూమి' అనే పేరుపెట్టారు. 'మే వార్‌ రెస్ట్ ఇన్ పీస్' అనేది ట్యాగ్‌ లైన్‌. చిత్రాంగదా సింగ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయనే ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతోంది. అయితే దీనిపై బాలీవుడ్ వర్గాలు వివరణ ఇచ్చాయి. నిజానికి ఈ సినిమా అసలు సెన్సార్‌కే సిద్ధం కాలేదని, తుది మెరుగుల్లో ఉన్న దీనికి సెన్సార్‌ వాళ్ళు ఇబ్బంది పెట్టారన్నది అవాస్తవమని పేర్కొంది.


'మాతృభూమి' సినిమా కథాంశం కారణంగా రాబోయే రోజుల్లో సెన్సార్‌ నుంచి అభ్యంతరాలు ఎదురయ్యే ఆస్కారం లేకపోలేదు. ఎందుకంటే ప్రస్తుతం భారత్‌ - చైనా మధ్య సత్ సంబంధాలు నెలకొని ఉన్నాయి. చైనా అధ్యక్షుడు సైతం ఇటీవలే బ్రిక్స్ సమావేశాల కోసం భారత్‌ కు వచ్చారు. అయితే 2020లో భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన సైనికుల గొడవ కారణంగా కొందరు జవాన్లు అమరులయ్యారు. ఆ వాస్తవ సంఘటనల ఆధారంగా సల్మాన్‌ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైనా ఇప్పుడున్న సత్‌ సంబంధాల కారణంగా సి.బి.ఎఫ్‌.సి. నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావచ్చు.

ఇటీవల తెలుగు సినిమా 'చైనా పీస్‌' పేరును మార్చమని సెన్సార్‌ వాళ్ళు కోరారు. దాంతో ఆ సినిమా పేరును 'సీక్రెట్‌ సోల్జర్'గా మార్చారు. అలానే 'ది బ్యాటిల్‌ ఆఫ్‌ గాల్వాన్' పేరును మార్చమని కోరినప్పుడు సల్మాన్ ఖాన్‌ 'మాతృభూమి'గా మార్చారు. ఈ నేపథ్యంలో రేపు సినిమాలో చైనాను టార్గెట్‌ చేస్తూ ఏవైనా సన్నివేశాలు ఉన్నా వాటిని తొలగించమని, లేదా వాటి తీవ్రతను తగ్గించమని కోరే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మేకర్స్ వి.ఎఫ్.ఎక్స్. ను పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఒకసారి తొలికాపీ రాగానే ముందు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తారట. వారి ఏవైనా సూచనలు, సవరణలు చేస్తే వాటిని అమలు పర్చి అప్పుడు రిలీజ్‌ డేట్ ను అనౌన్స్ చేస్తారని అంటున్నారు. అయితే అంతా అనుకున్నట్టుగా జరిగితే 'మాతృభూమి' సినిమాను వచ్చే రిపబ్లిక్‌ డే సమయానికి విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.

ఇవి కూడా చదవండి!

'కిల్లర్' మేకర్స్ సూపర్ షీ ఛాలెంజ్‌!

Disha Patani: పండగ ఏదైనా సరే.. అందాల ఆరబోత చేయాల్సిందే

మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య- జ్యోతిక

Updated Date - Sep 16 , 2026 | 04:13 PM