రాకేష్ మెహ్రాతో సల్మాన్!
ABN , Publish Date - Jun 24 , 2026 | 06:48 PM
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ రూట్ మార్చారు. రొటీన్ కమర్షియల్ యాక్షన్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి... బాక్సాఫీస్ షేక్ అయ్యే రేంజ్ పీరియాడిక్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. ఒక అదిరిపోయే కాంబినేషన్‌తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వేగం పెంచాడు. వరుస డిజాస్టర్ల తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ పెడుతున్నాడు. తాజాగా కండలవీరుడు కొత్త సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఇటీవల సల్మాన్, ఫర్హాన్ అక్తర్ కాంబోలో ఒక సినిమా రాబోతోందంటూ బాలీవుడ్ మీడియా తెగ హడావిడి చేసింది. అయితే, లేటెస్ట్ ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాకు ఫర్హాన్ అక్తర్ డైరెక్టర్ కాదు. 'రంగ్ దే బసంతి', 'భాగ్ మిల్కా భాగ్' వంటి క్లాసిక్ సినిమాలను అందించిన స్టార్ డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌ను ఫర్హాన్ అక్తర్ తన ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే కథలపైనే ఫోకస్ పెట్టారు. రాకేష్ మెహ్రా చెప్పిన లైన్ సల్మాన్‌కు విపరీతంగా నచ్చేసిందట. ఈ క్యారెక్టర్ కోసం సల్మాన్ ఖాన్ కంప్లీట్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా గతంలో సూర్య హీరోగా 'కర్ణ' అనే మైథలాజికల్ డ్రామాను ప్లాన్ చేసి, బడ్జెట్ కారణాల వల్ల పక్కన పెట్టారు. ఇప్పుడు సల్మాన్‌తో చేయబోయే పీరియడ్ ఫిల్మ్ అదే అయ్యింటుందని, దీనిని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ వర్గాల టాక్.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ లైనప్ చూస్తే చాలా క్రేజీగా ఉంది. వంశీ పైడిపల్లితో చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇది 2027 ఈద్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. దీని తర్వాత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఒక నో-మాస్క్ సూపర్ హీరో యాక్షన్ కామెడీ సినిమా చేస్తున్నారు. ఇది ఈ యేడాది అక్టోబర్ నాటికి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టులన్నీ ముగిశాక రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా మూవీ 2027 వేసవిలో ప్రారంభం కావచ్చునంటున్నారు. ఆసక్తికరమైన ఈ కాంబోలో వచ్చే సినిమా కోసం సల్లూభాయ్ అభిమానులు ఇప్పటి నుండే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?
పీఆర్ స్టంట్స్.. పిక్చర్స్‌కు పనికొచ్చేనా..!
‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్
Dharman: తలైవర్ 173 టైటిల్ ఖరారు.. రఫ్పాడించేస్తోన్న ఫస్ట్ లుక్!