Salman Khan: రామాయణం గొప్పతనాన్ని వదిలేసి బడ్జెట్‌పై చర్చేంటి?
ABN , Publish Date - Nov 07 , 2026 | 07:39 PM
తాజాగా విడుదలైన ‘రామాయణ’ (Ramayana) సినిమాపై సల్మాన్ ఖాన్ (Salman khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా విడుదలైన ‘రామాయణ’ (Ramayana) సినిమాపై సల్మాన్ ఖాన్ (Salman khan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మాతృభూమి’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ‘రామాయణ’ సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్ర నిర్మించిన ‘రామాయణ’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుమారు రూ.4 వేల కోట్లు బడ్జెట్ తో ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
"అసలు చర్చ జరగాల్సింది రామాయణం కథ మీద! అది వదిలేసి జనాలు సినిమాలో వీఎఫ్‌ఎక్స్, నిర్మాణ వ్యయం గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమాకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ అయిందంటూ మాట్లాడటం సరైన పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు రాముడు, సీతాదేవి, రావణుడు గురించి మాట్లాడాలి. రాముడి వ్యక్తిత్వం, ఆయనలోని సుగుణాలను ప్రజలకు చెప్పాలి. శ్రీరాముడు ఎంతో గొప్పవాడు. ఉత్తమ కుమారుడు, సోదరుడు, భర్త, గొప్ప యోధుడు. పురాణ గ్రంథాల్లో ఉన్న ఈ విషయాల గురించి మనం చర్చించాలి. ఆయా పాత్రల గొప్పతనం గురించి చర్చించాలి. ఇవన్నీ వదిలేసి ఏవేవో మాట్లాడుతున్నారు. నేను నటించిన ‘మాతృభూమి’ సినిమాలోని నా పాత్రలోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి’ అని సల్మాన్ ఖాన్ అన్నారు.
ALSO READ:
Anaswara Rajan: కథల ఎంపికలో నా ఫస్ట్ ప్రయారిటీ అదే..
ఎట్టకేలకు ‘హనుమాన్ అంశ్’ ఓటీటీకి.. ఎప్పుడంటే
నన్ను ఎంత తక్కువగా అంచనా వేస్తే.. అంతగా గెలిచి చూపిస్తా: ధనుష్