Salman Khan: తెలుగులో అభిమాన హీరో ఎవరంటే.. సల్మాన్ షాకింగ్ ఆన్సర్..
ABN, Publish Date - Nov 21 , 2026 | 10:31 AM
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు సినిమాలపై తనకున్న ఆసక్తిని మరోసారి వెల్లడించారు.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman khan) తెలుగు సినిమాలపై తనకున్న ఆసక్తిని మరోసారి వెల్లడించారు. టాలీవుడ్ అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాలపై స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్, విక్టరీ వెంకటేశ్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. ఇలా ఏ హీరో నుంచి పిలుపు వచ్చినా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అంతేకాదు, తెలుగులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని, ఇక్కడి ప్రేక్షకులకు నచ్చిన అభిమాన కథానాయకుడిగా తానే నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన ‘మాతృభూమి’ (Mathru Bhoomi) చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన మీడియాతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాల గురించి అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. టాలీవుడ్ అగ్ర హీరోలతో కలిసి తెరను పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన మాటలతో స్పష్టమైంది.అంతేకాదు, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి సినిమా చేయడం అద్భుతమైన అనుభూతి అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. వంశీ పైడిపల్లితో కలిసి పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన సల్మాన్.. మరోసారి తెలుగు సినిమాలో నటించేందుకు సిద్ధమని చెప్పడం విశేషం. మరి భవిష్యత్తులో ఆయన ఏ తెలుగు స్టార్‌తో కలిసి తెరపై సందడి చేస్తారో చూడాలి.
ALSO READ:
IFFI: సినిమా పండుగ.. 86 దేశాలు.. 150కి పైగా సినిమాలు!
Sukumar: సుకుమార్.. దుబాయిలో ఏం చేస్తున్నారంటే.
Moon Walk: 25 ఏళ్ల తర్వాత 'మూన్ వాక్' కోసం.. రిలీజ్ ఎప్పుడంటే..