సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sai Pallavi: రావణుడు చెడ్డవాడు కాదన్న సీతమ్మ..

ABN, Publish Date - Oct 28 , 2026 | 06:05 PM

లేడీ పవర్ స్టార్ ట్యాగ్ అందుకున్న సాయిపల్లవి(Sai Pallavi) వివాదాలను కొనితెచ్చుకోవడంలో మొదటి స్థానంలో ఉంటుంది. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అనే టైపులో ఉంటుంది.

Ramayana

లేడీ పవర్ స్టార్ ట్యాగ్ అందుకున్న సాయిపల్లవి(Sai Pallavi) వివాదాలను కొనితెచ్చుకోవడంలో మొదటి స్థానంలో ఉంటుంది. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే అనే టైపులో ఉంటుంది. అమ్మడి సినిమా ఏదైనా రావడం ఆలస్యం. ఏదో ఒక మాట అనేసి కాంట్రవర్సీగా మార్చడం సాయిపల్లవికి అలవాటుగా మారింది. విరాటపర్వం సమయంలో పాకిస్తాన్ ప్రజలు భారత సైన్యాన్ని ఉగ్రవాదులుగా భావిస్తారని, భారత ప్రజలు పాకిస్తాన్ సైన్యాన్ని అలాగే చూస్తారని, దృష్టి కోణాన్ని బట్టి హింస మారుతుందని వ్యాఖ్యానించి వివాదాన్ని కొనితెచ్చుకుంది. ఆ తరువాత ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చూపించిన కాశ్మీరీ పండిట్ల నిర్మూలనను, ఆవులను తరలిస్తున్న ముస్లిం వ్యక్తులపై జరిగిన దాడులతో పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేపాయి.


ఇక ఇప్పుడు సరికొత్త వివాదానికి సాయిపల్లవి తెరలేపింది. తాజాగా లాస్ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో అత్యంత వైభవంగా జరిగిన రామాయణం పార్ట్ 1 గ్లోబల్ 3D ప్రీమియర్ వేడుక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావనసురుడిగా, సాయిపల్లవి సీతాగా కనిపించిన ఈ పాన్-ఇండియన్ మైలాజికల్ చిత్రానికి సంబంధించిన త్రీడీ స్క్రీనింగ్ హాలీవుడ్‌లో గ్రాండ్‌గా జరిగింది. అయితే, సినిమా విజువల్స్ కంటే ఈ వేడుకలో సాయిపల్లవి చేసిన ఒక స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా, వివాదాస్పదంగా మారింది.


ఈ ప్రీమియర్ అనంతరం సాయిపల్లవి మాట్లాడుతూ.. 'రావణుడు పూర్తిగా చెడ్డవాడేమీ కాదు.. మనందరిలోనూ ఉన్న రావణాసురుడిని గుర్తించి, కాలక్రమేణా మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం' అంటూ చెప్పుకొచ్చింది. ఇతిహాసంలోని పాత్రల సంక్లిష్టతను, మానవ స్వభావాన్ని ఉద్దేశించి ఆమె ఈ మాటలు అన్నప్పటికీ, సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రామాయణ ఉత్తరకాండ, వాల్మీకి రామాయణంలో రావణాసురుడు చేసిన అమానుష కృత్యాలను నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.


రంభను లైంగికంగా వేధించడం, నలకూబరుడి శాపం, వేదవతిని అవమానించడం, సీతమ్మవారిని అపహరించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిని పూర్తిగా చెడ్డవాడు కాదు అని సమర్థించడం ఏంటని విరుచుకుపడుతున్నారు. లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తి కూడా చెడ్డవాడు కాకపోతే.. అసలు చెడుకి అర్థం ఏంటి? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి అమ్మాయికి సీతలాంటి పాత్ర ఇవ్వడమే తప్పు అని మండిపడుతున్నారు. ఓ పక్క నవంబర్ 5న విడుదల కానున్న రామాయణ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, సాయిపల్లవి చేసిన ఈ కామెంట్స్ చిత్ర యూనిట్‌కు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి.

Updated Date - Oct 28 , 2026 | 06:13 PM