సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఓ మై డాగ్’.. ఆ డాగ్ ఎంత పని చేసింది.. రవీనా టాండన్ ధైర్యానికి నెటిజన్లు ఫిదా

ABN, Publish Date - Aug 07 , 2026 | 07:37 PM

ముంబైలో ‘ఓ మై డాగ్’ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన వేడుకలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ వేడుకలో ప్రదర్శించిన సమయస్ఫూర్తికి అంతా ఫిదా అవుతున్నారు.

Raveena Tandon Incident

ముంబైలో ‘ఓ మై డాగ్’ (Ohh My Dog) మూవీ స్పెషల్ స్క్రీనింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన వేడుకలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ (Raveena Tandon) ఈ వేడుకలో ప్రదర్శించిన సమయస్ఫూర్తికి అంతా ఫిదా అవుతున్నారు. ఆ వేదికపై ఓ డాగ్ అనూహ్యంగా ప్రవర్తించగా.. వెంటనే రవీనా ధైర్యంగా ఎదుర్కొన్న విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు విషయానికి వస్తే.. ‘ఓ మై డాగ్’ స్పెషల్ స్క్రీనింగ్ నిమిత్తం ఏర్పాటు చేసిన వేడుకకు రవీనా టాండన్ పసుపు రంగు దుస్తుల్లో హాజరయ్యారు. స్టేజ్‌పై ఆమె నిలబడి ఉండగా.. అక్కడకు ఓ డాగ్‌ని తీసుకుని వచ్చారు. ఆ డాగ్‌ను ఆప్యాయంగా నిమురుతూ ఆమె ఫొటోకు ఫోజులిచ్చారు. అలా కాసేపటికి ఆమె పైకి లేచే సమయంలో డ్రస్ చేతి భాగంలో ఉన్న దారం డాగ్ నోటికి చిక్కింది. దాదాపు ఆమె చేతిని కరిచినంత పనిచేసిందా డాగ్. వెంటనే అప్రమత్తమైన రవీనా.. తన చేతిని వెనక్కి లాక్కుంది.. అయినా భయపడకుండా, డాగ్‌ని నెట్టేయకుండా అలాగే నిలబడి పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ ఓపికగా వేచి చూసింది. అనంతరం మళ్లీ అదే డాగ్‌ను ప్రేమగా నిమిరి.. జంతువుల పట్ల తన ప్రేమని చాటుకుంది.


ఆ కార్యక్రమం నుంచి ఆమె వెళ్లే సమయంలో కొందరు మీడియా వారు ఆమెని ఈ ఘటనపై ప్రశ్నించారు. మీకు ఏమైనా అయ్యిందా? డాగ్ మిమ్మల్ని ఏమైనా చేసిందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘అది నన్నేం చేయలేదు. మరో కుక్కను చూసి అలా మొరిగింది. ఆ సమయంలో అనుకోకుండా నా డ్రస్ దారం దాని నోటికి దొరకడంతో ఇలా జరిగింది’’ అని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. ఇందులో రవీనా ప్రదర్శించిన సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


‘ఓ మై డాగ్’ విషయానికి వస్తే.. దర్శకుడు అమిత్ రాయ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో షూట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జంతువులతో పని చేయడం సవాలుగా మారిందని దర్శకుడు తెలిపారు. ముఖ్యంగా 200కు పైగా శిక్షణ లేని వీధి కుక్కలు.. అంబులెన్స్‌లను వెంబడించే ఓ సన్నివేశాన్ని షూట్ చేసేందుకు చాలా కష్టపడ్డామని, స్ట్రీట్ డాగ్స్‌కు ఆహారం అందించే ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పలుమార్లు ప్రాక్టీస్ చేసి విజయవంతంగా పూర్తి చేశామని దర్శకుడు అమిత్ రాయ్ అన్నారు. ఆగస్ట్ 07న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది.

ఈ వార్తలను కూడా చదవండి:

హైప్‌ని అందుకోలేకపోతోన్న సుకుమార్ శిష్యులు

‘కొరియన్ కనకరాజు’ నాయికపైనే ఇప్పుడందరి చూపు..!

‘బాహుబలి’ని దాచాడు కానీ.. మహేష్‌ని జక్కన్న దాచలేకపోతున్నాడా

Updated Date - Aug 07 , 2026 | 08:55 PM