డాన్ 3 వివాదం.. రూ. 45 కోట్ల సెటిల్‌మెంట్ ఫెయిల్
ABN, Publish Date - May 27 , 2026 | 03:43 PM
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) కి వివాదాలు కొత్తేమి కాదు. అయితే ఇప్పటివరకు ఏ వివాదం కూడా ఈ హీరోను బ్యాన్ చేసేవరకు వెళ్ళలేదు. కానీ, డాన్ 3 (Don 3) వివాదం మాత్రం అందుకు భిన్నమని చెప్పొచ్చు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) కి వివాదాలు కొత్తేమి కాదు. అయితే ఇప్పటివరకు ఏ వివాదం కూడా ఈ హీరోను బ్యాన్ చేసేవరకు వెళ్ళలేదు. కానీ, డాన్ 3 (Don 3) వివాదం మాత్రం అందుకు భిన్నమని చెప్పొచ్చు. డాన్ 3 సినిమా చేస్తాను అని ఒప్పుకొని, రూ. 10 కోట్లు అడ్వాన్స్ తీసుకొని.. ఇంకో రెండువారాల్లో సినిమా మొదలు కాబోతుండగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. దీనివలన డాన్ 3 డైరెక్టర్ ఫరాన్ అక్తర్, నిర్మాణ సంస్థ ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ కి అక్షరాలా రూ. 45 కోట్ల నష్టం వాటిల్లింది.
ఇక దీంతో ఫరాన్ అక్తర్, నిర్మాత రితేష్ సిధ్వాని ఇద్దరూ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఎఫ్.డబ్ల్యు.ఐ.సీ.ఈ.) లో రణ్‌వీర్ సింగ్‌పై ఫిర్యాదు చేయడంతో.. ఆయనను ఇండస్ట్రీ నుంచి మూడేళ్లు బ్యాన్ చేశారు. ఇక దీంతో రణ్ వీర్.. ఫరాన్ అక్తర్, రితేష్ తో రాజీకి దిగినట్లు తెలుస్తోంది. వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించి, భవిష్యత్తులో సత్సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడానికి రణ్‌వీర్ సింగ్ టీమ్ ఎక్సెల్ సంస్థకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ముందుంచింది. మొత్తం రూ. 45 కోట్ల సెటిల్‌మెంట్ చేసుకోవడానికి తాము ఓకే అని చెప్పారు.
రూ. 10 కోట్లు ముందస్తుగా చెల్లిస్తామని, డాన్ 3 కాకుండా ఎక్సెల్ సంస్ద తో మరో సినిమా చేస్తే రూ. 25 కోట్ల తగ్గింపును కూడా వారు ప్రతిపాదించారట. ఈ విధంగా మొత్తంగా రూ. 35 కోట్ల విలువైన డీల్‌తో తక్షణ పరిహారం అందిస్తూనే, ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవాలని రణ్‌వీర్ భావించారు. అయితే రణ్‌వీర్ సింగ్ టీమ్ ఇచ్చిన ఈ భారీ ఆఫర్ నిర్మాతలకు ఏమాత్రం నచ్చలేదని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వాని ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారట. భవిష్యత్తులో రణ్‌వీర్ సింగ్‌తో మళ్లీ కలిసి పనిచేసే ఉద్దేశం తమకు అస్సలు లేదని ఎక్సెల్ టీమ్ స్పష్టం చేసినట్లు సమాచారం. మరి రణ్‌వీర్ సింగ్ ఈ వివాదం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.
ఇవి కూడా చదవండి:
Rana Daggubati: పాములు, మొసళ్ళను కూడా తింటాను..
‘ఫౌజీ’లో చేస్తున్నందుకు గర్వంగా ఉంది- జయప్రద
Mahesh Babu: మహేష్ మౌనం వెనక రీజనేంటి..? మహేష్ బాబు సైలెంట్.. ఫ్యాన్స్‌లో టెన్షన్!