Mahesh Babu: మహేష్ మౌనం వెనక రీజనేంటి..? మహేష్ బాబు సైలెంట్.. ఫ్యాన్స్‌లో టెన్షన్!
ABN , Publish Date - May 27 , 2026 | 03:54 PM
మన స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమాను లైన్‌లో పెడుతుంటారు. అసలు కాల్ షీట్స్ ఖాళీ లేకుండా పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. కానీ, టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం.
మన స్టార్ హీరోలందరూ ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమాను లైన్‌లో పెడుతుంటారు. అసలు కాల్ షీట్స్ ఖాళీ లేకుండా పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నారు. కానీ, టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ప్రస్తుతం మహేష్ బాబు టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో గ్లోబల్ వైడ్ అడ్వెంచరస్ ఫిల్మ్ వారణాసి చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే, ఈ ఏడాది ఆగష్టు కల్లా షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలనే టార్గెట్‌తో అటు జక్కన్న, ఇటు మహేష్ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, అసలు సస్పెన్స్ ఇక్కడే మొదలైంది!
వారణాసి సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రం ఏంటి..? ఏ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నారు..? అనే విషయాలపై ఇప్పటివరకు చిన్న లీక్ కూడా రాలేదు. సాధారణంగా ఒక పెద్ద సినిమా అయిపోవడానికి ముందే నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి. కానీ, ఈ సినిమా విషయంలో మాత్రం టోటల్ సైలెన్స్ కనిపిస్తోంది. ఇది ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఘట్టమనేని అభిమానులను సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఒక్కసారి ఆలోచించండి.. గుంటూరు కారం రిలీజ్ అయినప్పటి నుంచి సూపర్ స్టార్ కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసమే తన పూర్తి సమయాన్ని కేటాయించారు. గడ్డం పెంచడం, మేకోవర్ మార్చడం లాంటి వాటి కోసమే దాదాపు మూడేళ్ల విలువైన కాలాన్ని దీనికే ఇచ్చేశారు. ఒకవేళ ఆగష్టు కల్లా షూటింగ్ పూర్తయినా, గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కనీసం 7 నుంచి 8 నెలల సమయం పడుతుంది. అందులో ఒక రెండు నెలలు ప్రమోషన్స్ కోసం కేటాయించినా.. మహేష్ బాబుకు మరో 6 నెలల పాటు ఎలాంటి షూటింగ్స్ లేకుండా ఖాళీ సమయం దొరుకుతుంది.
అయినప్పటికీ, ఈ ఆరు నెలల గ్యాప్‌లో ఏదైనా చిన్న సినిమా చేద్దామనో లేదా కొత్త కథలు విందామనో మహేష్ అనుకోవడం లేదు. కొత్త స్టోరీస్ వైపు ఆయన అస్సలు మొగ్గు చూపకపోవడం వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందనేది ఫిలిం నగర్ టాక్. మహేష్ బాబు తన ఫోకస్ మొత్తాన్ని కేవలం వారణాసి చిత్రంపైనే ఉంచారు. ఎందుకంటే, ఈ సినిమా రిజల్ట్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉండబోతోంది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టించిన తర్వాత, సూపర్ స్టార్ ఇమేజ్ హాలీవుడ్ రేంజ్‌కి వెళ్తుందని అందరూ భావిస్తున్నారు.
అందుకే, అంతకంటే తక్కువ స్థాయి ఉన్న కథలను టచ్ చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు. అయితే మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఎవరూ లేరా అంటే.. ఓ పెద్ద క్యూనే లైన్లో ఉంది! ముఖ్యంగా యానిమల్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా, అటు కేజీఎఫ్, సలార్ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన ప్రశాంత్ నీల్ లాంటి క్రేజీ దర్శకులు మహేష్ బాబు కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్స్‌తో రెడీగా ఉన్నారని టాక్.
మరోవైపు సూపర్ స్టార్ డేట్స్ దొరికితే చాలు, వందల కోట్లు కుమ్మరించడానికి టాలీవుడ్ బడా నిర్మాతలు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, జక్కన్న సినిమా పూర్తయి రిలీజ్ అయ్యేంత వరకు మహేష్ బాబు ఏ ఒక్కరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా లేరు. రాజమౌళి సినిమా ఇచ్చే మైలేజ్ చూశాకే, తన నెక్స్ట్ మూవీ రేంజ్ ఎలా ఉండాలో మహేష్ డిసైడ్ చేయబోతున్నారు. మరి ఈ స్టార్ డైరెక్టర్ల లిస్ట్‌లో మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఫైనల్ అవుతుంది అనేది ప్రస్తుతానికి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నే.