రణ్‌వీర్ సింగ్ బహిరంగ క్షమాపణ.. కేసు కొట్టేసిన హైకోర్టు!
ABN, Publish Date - Apr 26 , 2026 | 01:45 PM
మైసూరు చాముండేశ్వరి భక్తులకు రణ్‌వీర్ సింగ్ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నెలరోజుల్లోగా మైసూరు చాముండేశ్వరిదేవిని దర్శించుకుంటానని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh)పై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు (High Court of Karnataka) కొట్టివేసింది. మైసూరు చాముండేశ్వరి భక్తులకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు నెలరోజుల్లోగా మైసూరు చాముండేశ్వరిదేవిని దర్శించుకుంటానని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. గత ఏడాది నవంబరు 28న గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రణ్‌వీర్ సింగ్.. ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1) సినిమా గురించి ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అలాగే మైసూరు చాముండేశ్వరి దేవిని ప్రస్తావిస్తూ అపహాస్యంగా మాట్లాడారు. రణ్‌వీర్ సింగ్ వ్యాఖ్యలపై బెంగళూరులో ఆడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది ప్రశాంత్ మెథన్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
న్యాయవాది వేసిన ప్రైవేటు పిటిషన్‌తో పాటు, ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణ్‌వీర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. తాను ముంబైలోని సింధి కుటుంబానికి చెందినవాడినని, ఘటన జరిగిన రోజు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలుసుకోలేకపోయానని పేర్కొన్నారు. ఇది సున్నితమైన అంశమని తనకు తెలియదని, తన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని. బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. త్వరలోనే చాముండేశ్వరి దేవిని దర్శించుకుని, పూజలు చేసి భక్తిని చాటుకుంటానని హైకోర్టుకు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
రాజమౌళి వెనక ఉన్న ఫోటోలో ఒక మినీ ప్రపంచమే ఉంది.. చూశారా?
బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?
లెజెండరీ మల్టీస్టారర్ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!