సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'కాంతార' వివాదానికి ఫుల్ స్టాప్ పడేనా?

ABN, Publish Date - Mar 25 , 2026 | 05:31 PM

కాలు జారితే తీసుకోవచ్చుకానీ నోరు జారితే తీసుకోవడం కష్టం. ఎవరైనా సరే నోరు అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలి. లేదంటే ఎంత తోపు సెలబ్రెటీ అయినా కష్టాలు పడక తప్పదు.. బీటౌన్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌ ఇప్పుడు అలాంటి సమస్యలో చిక్కుకొని చివరికి క్షమాపణకు సిద్ధమయ్యాడు.

'కాంతార' దైవ సన్నివేశాన్ని కించపరిచినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయమై ఏప్రిల్ 10న కర్ణాటక హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నాడు. 'కాంతార'లోని అరుపుని అనుకరించి కన్నడ ప్రజల మనోభావాలను రణవీర్‌ దెబ్బ తీశారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో.. దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


‘భూత కోల’ అనేది కేవలం నృత్యం కాదు, దక్షిణ కర్ణాటకలో కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే ఆచార సంప్రదాయం అని పిటిషనర్లు వాదించారు. కేవలం వినోదం కోసం దైవ సమానమైన ఆచారాలను వెక్కిరించడం భక్తుల మనోభావాలను గాయపరిచిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టుకు విన్నవించారు.

కళాత్మక స్వేచ్ఛ అనేది ఇతరుల సంస్కృతి, మత భావాలను అవమానించేందుకు కాదని, ప్రజాదరణ కలిగిన నటులు ప్రాంతీయ ఆచారాలను గౌరవించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఉందని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రణ్‌వీర్ సింగ్ నుంచి వివరణ వచ్చిన తర్వాత తదుపరి విచారణ కొనసాగనుంది. ఈ కేసు భవిష్యత్తులో సెలబ్రిటీలు ఇతర ప్రాంతాల సంస్కృతుల గురించి మాట్లాడేప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక ముఖ్యమైన ఉదాహరణగా నిలవనుంది.

Read Also: అతని వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను... భోరుమన్న మోనాలిసా!

Read Also: అక్షయ్ కుమార్‌ కోసం అర్జిత్‌ యూ టర్న్!

Updated Date - Mar 25 , 2026 | 05:46 PM