సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఈ వయసులో శ్రీరాముడి పాత్రలో జీవించడం చాలా కష్టం: రణ్‌బీర్ కపూర్

ABN, Publish Date - Jul 25 , 2026 | 10:11 AM

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రామాయణ’. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు.

Ranbir Kapoor about Ramayana

భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) కనిపించనుండగా, రావణాసురుడి పాత్రను కన్నడ స్టార్‌ యశ్‌ (Yash) పోషిస్తున్నారు. తాజాగా అమెరికాలో నిర్వహిస్తోన్న ప్రముఖ శాన్‌ డియాగో కామిక్‌ - కాన్‌ 2026 వేడుకల్లో ఈ చిత్రబృందం పాల్గొంది.


ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్‌ మాట్లాడుతూ.. శ్రీరాముడి పాత్ర కోసం తనను తాను దీర్చిదిద్దుకున్న తీరును వివరించారు. ‘శ్రీరాముడి పాత్రకు తగ్గట్టుగా శారీరకంగా, మానసికంగా సిద్ధం కావడం సులువే. కానీ ఈ వయసులో నేను శ్రీరాముడి తత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవడం, ఆ పాత్రలో జీవించడం చాలా కష్టమైన పని. అన్ని వయసుల వారూ కనెక్ట్‌ అయ్యేలా ఈ పాత్ర ఉండాలి. పైపైన మార్పుల కంటే శ్రీరాముడి బోధనలు అర్థం చేసుకోవడమే నాకు ముఖ్యమని భావించాను. అందుకోసం చాలా లోతుగా అధ్యయనం చేశాను. ఎన్నో పుస్తకాలు చదివాను, అనేక మంది పండితులను కలిశాను. అంతేకాదు ఈ పాత్ర కోసం రేండేళ్లపాటు యోగా చేసి ఆధ్యాత్మిక క్రమశిక్షణను కూడా పాటించాను. సువీర్‌ అనే నా గురువు గంటల తరబడి నాతో ధ్యానం చేయించేవారు. దీనివల్ల నేను శ్రీరాముడి బోధనలకు దగ్గరయ్యాను’ అని చెప్పారు. మరోవైపు రణ్‌బీర్‌ కపూర్‌పై యశ్‌ ప్రశంసలు కురిపించారు. రాముడి పాత్ర పోషించడం చాలా కష్టమని, అందుకోసం రణ్‌బీర్‌ చాలా కష్టపడ్డారని కొనియాడారు.


ట్రైలర్‌ విడుదల వాయిదా

రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ‘రామాయణ’ చిత్రాన్ని నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందులో భాగంగా శుక్రవారం విడుదల కావాల్సిన ట్రైలర్‌ వాయిదా పడింది. ట్రైలర్‌ను మరింత గ్రాండ్‌గా తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్రముఖ హాలీవుడ్‌ స్టూడియో సోనీ పిక్చర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు యూనిట్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

అల్లుడు భద్రంకు ‘మెగా158’లో అవకాశం.. సోము వీర్రాజు ఏం చేశారంటే

‘కపాలి’గా రోహిత్ నారా.. ఫస్ట్ లుక్ అదిరింది

రేర్ కాంబోతో మణిరత్నం లవ్‌ స్టోరీ.. ఇక ఊహించుకోండి

Updated Date - Jul 25 , 2026 | 10:11 AM