Ranabir Kapoor: రామాయణ ట్రైలర్ వచ్చేస్తోంది!

ABN , Publish Date - Jul 29 , 2026 | 05:27 PM

రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న 'రామాయణ' చిత్రం ట్రైలర్ గురువారం ఉదయం విడుదల కాబోతోంది.

Ramayana Movie

రణబీర్‌ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ' ట్రైలర్ ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణంగా దానిని వాయిదా వేశారు. అయితే తాజాగా ఆ ట్రైలర్ విడుదల తేదీని, సమయాన్ని మేకర్స్ తెలియచేశారు.

భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత గొప్ప సాంస్కృతిక వారసత్వాల్లో రామాయణం ఒకటి. తరతరాలుగా ఇది కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయుల పండుగలు, విలువలు, జీవన విధానం, సంస్కృతిలో విడదీయరాని భాగంగా కొనసాగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజంలోనూ రామాయణం తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఈ అజరామర గ్రంథాన్ని దృశ్యం కావ్యంగా మలుస్తున్నారు నితీశ్‌ తివారీ. ఈ నెల 24న ట్రైలర్ ను విడుదల చేయాలని అనుకున్నా, అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు దీనిని గురువారం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4.15 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.


ఈ యేడాది దీపావళికి 'రామాయణ' తొలి భాగం విడుదల కానుంది. మలి భాగాన్ని వచ్చే యేడాది దీపావళికి విడుదల చేస్తారు. ఈ సినిమాలో యశ్‌ రావణాసురుడిగా నటిస్తుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా శోభన, విశ్వామిత్ర మహర్షిగా అజింక్య దేవ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్‌, మండోదరిగా కాజల్ అగర్వాల్‌, లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తున్నారు. గతంలో రామానంద్‌ సాగర్ 'రామాయణం'లో రాముడిగా నటించిన అరుణ్‌ గోవిల్ ఇందులో దశరథ మహారాజు పాత్ర పోషిస్తుండటం విశేషం. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఆస్కార్ విజేతలైన హాన్స్ జిమ్మర్, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రమేష్‌కు పవన్ కళ్యాణ్ రూ. 5 లక్షల సాయం.. ‘గబ్బర్‌సింగ్’ టీమ్ స్పందనిదే

సూర్య, రాజమౌళి క్రేజీ కాంబో టాక్.. సోషల్ మీడియా షేక్!

‘మా’ ఆధ్వర్యంలో ముగిసిన పావలా శ్యామల అంత్యక్రియలు

Updated Date - Jul 29 , 2026 | 05:29 PM