సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రెండు రోజులు ఆలస్యంగా రానున్న రామాయణం..

ABN, Publish Date - Aug 08 , 2026 | 06:06 PM

భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహా ఇతిహాస కావ్యం రామాయణ. నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యష్ నటించారు.

Ramayana

భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహా ఇతిహాస కావ్యం రామాయణ (Ramayana). నితీష్ తివారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడుగా యష్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హాలీవుడ్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవలే మేకర్స్ గ్లోబల్ వైడ్ గా విడుదల చేసిన ఇంగ్లీష్ ట్రైలర్ ఇంటర్నేషనల్ స్థాయిలో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు ముందే ప్రకటించారు.


అయితే ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాత నమిత్ మల్హోత్రా ఇచ్చిన ప్రకటన ఇప్పుడు ఇండియన్ ఆడియెన్స్‌ను షాక్‌కు గురిచేస్తోంది. ఇండియాలో మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నవంబర్ 8న థియేటర్లలోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశపు గొప్ప కావ్యంతో తీస్తున్న ఈ సినిమాను సొంత దేశంలోనే ఆలస్యంగా విడుదల చేయడమేంటని ఇండియన్ సినీ ప్రేమికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు రోజుల గ్యాప్ వల్ల ఓవర్సీస్ నుంచి వచ్చే టాక్, రివ్యూస్, సోషల్ మీడియా స్పోయిలర్స్ ఇండియన్ బాక్సాఫీస్ పై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.


ఓవర్సీస్ ప్రీమియర్లు మరియు ఇంటర్నేషనల్ మార్కెట్‌పై భారీ నమ్మకంతోనే నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ, నవంబర్ 8న ఇండియాలో విడుదలయ్యే వరకు ఇండియన్ ఆడియెన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఇది ఇండియన్స్ అవమానించడమే అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ మధ్య రామాయణ మొదటి షో మోదీకి చూపించి ఆయన ఓకే అన్నాకనే రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

Updated Date - Aug 08 , 2026 | 06:08 PM