Ramayana Movie: యశ్‌ను అలా చూస్తే చాలు.. డైలాగ్ కూడా అవసరం లేదు.. రకుల్ కామెంట్స్
ABN, Publish Date - Oct 20 , 2026 | 10:14 AM
బాలీవుడ్ స్టార్స్, భారీ నిర్మాణ విలువలు, భారతీయ ఇతిహాసం.. ఇలా ‘రామాయణం’ సినిమాపై అంచనాలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి.
బాలీవుడ్ స్టార్స్, భారీ నిర్మాణ విలువలు, భారతీయ ఇతిహాసం.. ఇలా ‘రామాయణం’ (Ramayana) సినిమాపై అంచనాలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), యశ్ (Yash), సాయి పల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆసక్తిని పెంచుతోంది.
రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత తెలుగు ఆడియన్స్‌ను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా ప్రయాణం ఇక్కడే మొదలైంది, ఇప్పుడు ‘రామాయణ’ లాంటి పెద్ద సినిమాతో మీ ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. రామాయణం అంటే మన చరిత్ర, ఒక నిజం. ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శక నిర్మాతలకు థాంక్యూ. అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను రూపొందించారు. రణ్‌బీర్ గారు అద్భుతంగా చేశారు. స్క్రీన్‌పై ఆయన నటన అదిరిపోతుంది. సీత పాత్రలో సాయి పల్లవి ఎంతో నిజాయితీగా, అందంగా నటించారు. ఇక యష్‌ను అలా చూస్తే సరిపోతుంది.. డైలాగ్ కూడా అవసరం లేదని అన్నారు. రామాయణం సినిమాను మీరందరూ ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను అని తెలిపింది.
లక్ష్మణ పాత్రధారి రవి దూబే మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ గారు అద్భుతంగా అభినయించారు. ఆయనతో కలిసి నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సాయి పల్లవి గారు సీత పాత్ర కోసమే పుట్టారు. ఆమె ఎంతో నిజాయితీగా నటించారు. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. ఇంత గొప్ప సినిమాను మీ అందరి ముందుకు తీసుకొస్తున్నారు. ఈ భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి దగ్గరికి ‘రామాయణ’ కథ చేరాలని కోరుకుంటున్నాను.