రామాయణ.. మొదటి రోజు కలక్షన్స్ ఎంతంటే
ABN, Publish Date - Nov 06 , 2026 | 05:37 PM
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణ' (Ramayana). రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ ఎపిక్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా నవంబర్ 5 న థియేటర్లలోకి వచ్చి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణ' (Ramayana). రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ ఎపిక్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా నవంబర్ 5 న థియేటర్లలోకి వచ్చి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. 3D, IMAX వర్షన్లలో ఈ సినిమా అందించిన విజువల్ ఎక్స్పీరియెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది.
నమిత్ మల్హోత్రా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ దృశ్యకావ్యం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా రూ. 155 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇది రాముడి యుగానికి ఆరంభం అంటూ మేకర్స్ విడుదల చేసిన డే-1 కలెక్షన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటి రోజే రూ. 155 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించడంతో ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక డే-1 గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రాల సరసన చేరింది.
నార్త్ ఇండియాలోనే కాకుండా సౌత్ ఇండియాలోనూ, ఓవర్సీస్లోనూ ఈ సినిమాకు ఊహించని రేంజ్లో బుకింగ్స్ నమోదయ్యాయి. విఎఫ్ఎక్స్ వర్క్, నటీనటుల పర్ఫార్మెన్స్పై ట్రేడ్ వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో వీకెండ్ నాటికి ఈ కలెక్షన్లు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి రామాయణం చిత్రం తొలిరోజే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతూ పాన్-ఇండియా రేంజ్లో సరికొత్త బెంచ్మార్క్ క్రియేట్ చేసింది. ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్, ప్రైమ్ ఫోకస్ వంటి బడా సంస్థలు భాగస్వామ్యంగా వచ్చిన ఈ విజువల్ వండర్ రాబోయే రోజుల్లో ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో వేచి చూడాలి.