ఆర్థిక వివాదాల్లో ఆర్జీవీ.. ‘పోలీస్ కంపెనీ’పై బకాయిల సెగ!

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:53 PM

పాత ఆర్థిక లావాదేవీలు రామ్ గోపాల్ వర్మకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఎక్లాటెంట్ ఫిలిమ్స్ పబ్లిక్ నోటీసుతో హర్షవర్ధన్ రాణే నటిస్తున్న ‘పోలీస్ కంపెనీ’ సినిమా విడుదలపై సందిగ్ధత నెలకొంది.

Ram Gopal Varma

మేవరిక్ డైరెక్టర్ రామ్ గోపాల్‌ వర్మ ఆర్థిక లావాదేవీల వివాదంలో నిండా కూరుకుపోయారు. గతంలో ఆయన చేసిన అప్పులు ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలతో ఆయన జరిపిన ఆర్థిక లావాదేవీలు ఇప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలపై నీలినీడలు అలుముకునేలా చేశాయి.

కొన్నేళ్ళ పాటు ముంబైలో ఉన్న వర్మ ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు మకాం మార్చారు. ఇక్కడే 'డెన్' పేరుతో ఓ భవంతిని లీజ్‌కు తీసుకుని అక్కడ ఉన్నారు. అయితే కొంతకాలం క్రితం వర్మ తిరిగి తన మకాంను ముంబైకి మార్చినట్టు సన్నిహితులు తెలిపారు. హైదరాబాద్‌లో ఉండగా 'పోలీస్‌ స్టేషన్‌ మే భూత్‌' సినిమాను తెరకెక్కించారు వర్మ. ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్‌, రమ్యకృష్ణ, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినా... విడుదలకు మాత్రం నోచుకోలేదు. అయితే ఇప్పుడు ముంబైకు మకాం మార్చిన వర్మ అక్కడ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సీరిస్‌తో కలిసి 'పోలీస్‌ కంపెనీ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు హర్షవర్థన్ రాణే పోలీస్‌ ఆఫీసర్‌, ఎన్ కౌంటర్‌ స్పెషలిస్ట్ దయా నాయక్‌ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాగానే మొదట ముంబై సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌ వర్మకు నోటీసులు జారీ చేసింది. గతంలో తాము మధ్య వర్తులుగా ఉన్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, బకాయిలు తీర్చాలని, లేదంటే సినిమా షూటింగ్‌కు సహకరించమని అల్టిమేటమ్‌ జారీ చేసింది. దాంతో టీ సీరిస్‌ సంస్థ తమ సినిమా షూటింగ్‌కు ఎక్కడ అంతరాయం కలుగుతుందోననే భయంతో వర్మ బకాయిలను తీర్చేసింది.


అయితే ఇప్పుడు తాజాగా వర్మకు ఎక్లాటెంట్‌ ఫిల్మ్స్ నుంచి పబ్లిక్‌ నోటీసులు జారీ అయ్యాయి. 2010 ఏప్రిల్‌ 10న జరిగిన ఒప్పందం ప్రకారం వర్మ తమకు పెద్ద మొత్తంలో బకాయి ఉన్నాడని ఈ సంస్థ తెలిపింది. 11, 38, 92,000 కోట్లకు గానూ వడ్డీతో కలిపి ఇప్పటికీ రూ. 29,67,64,000 కోట్లు కట్టాలని తేల్చి చెప్పింది. గతంలో ముంబై హైకోర్టు దీనిని ధృవీకరించింది. ఇప్పుడు వర్మ హిందీలో సినిమా తీస్తున్న నేపథ్యంలో ఎక్లాటెంట్‌ ఫిలిమ్స్ తమ పాత బకాయిలపై పట్టుపడుతోంది. అక్టోబర్‌ నెలాఖరులోపు తమ అప్పు తీర్చకుంటే వర్మ చేసే ప్రాజెక్టులపై కోర్టుకు వెళతామని హెచ్చరించింది. వర్మ తమ బాకీలు తీర్చుకుంటే సినిమా విడుదలను కూడా అడ్డుకుంటామని పేర్కొంది. దాంతో టీ సీరిస్‌ నిర్మిస్తున్న 'పోలీస్‌ కంపెనీ' మూవీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్లాటెంట్‌ ఫిలిమ్స్ ఇచ్చిన పబ్లిక్‌ నోటీస్‌పై వర్మ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ట్విస్ట్.. నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు

‘జిమ్ జిమ్ తార’ సాంగ్.. కాంట్రవర్సీలో ‘ఆదర్శ కుటుంబం’

Updated Date - Oct 31 , 2026 | 05:06 PM