Kajal: విడాకులు.. కాజల్ షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Sep 21 , 2026 | 03:06 PM
'మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలామంది ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
'మనిషి జీవితంలో స్మార్ట్‌ఫోన్ ఒక భాగమైపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలామంది ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియా, చాటింగ్, రీల్స్ అంటూ గంటల తరబడి స్క్రీన్ ముందే ఉంటున్నారు. అయితే ఈ అలవాటు క్రమంగా మనుషుల మధ్య ఉన్న అనుబంధాలపై ప్రభావం చూపుతోందని' సినీ నటి కాజల్ (Kajal) అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆమె అన్నారు. కలిసి బయటకు వెళ్లినా, డిన్నర్‌కు వెళ్లినా.. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కంటే ఫోన్లలోనే మునిగిపోతున్నారని పేర్కొన్నారు. పక్కనే ఉన్న వ్యక్తితో మాట్లాడకుండా సోషల్ మీడియాలో సమయం గడపడం వల్ల బంధాల్లో దూరం పెరుగుతోందని చెప్పారు.
కాజల్ మాట్లాడుతూ "ఏ బంధమైనా బలంగా ఉండాలంటే అందులో మంచి సంభాషణ, పరస్పర అవగాహన, ఒకరికొకరు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా భాగస్వామితో కలిసి ఉన్నప్పుడు ఫోన్‌ను పక్కన పెట్టి.. పూర్తిగా వారితో మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. సోషల్ మీడియా కోసం వెచ్చించే సమయాన్ని కొంత తగ్గించుకుని.. మనకు ఇష్టమైన వారితో అర్థవంతమైన సంభాషణలు చేయడం అలవాటు చేసుకోవాలి. నేను, నా భర్త కూడా మా ఖాళీ సమయాన్ని చాలా విలువైనదిగా భావిస్తాం. ప్రతి వారం కలిసి డిన్నర్‌కు వెళ్లడం మా అలవాటు. ఆ సమయంలో ఇద్దరం ఫోన్లను పక్కన పెట్టేస్తాం. ప్రశాంతంగా ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం. ఇలా కలిసి గడిపే సమయం మా మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుందని నేను నమ్ముతాను. ఇప్పటి డిజిటల్ యుగంలో ఫోన్, సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కానీ మన బంధాల కోసం కొంత సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు ఫోన్ కంటే మనుషులకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి' అన్నారు. ఇటీవల ‘ది ఇండియా స్టోరీ’తో ప్రేక్షకులను పలకరించాను కాజల్.