సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Prithviraj Sukumaran: ‘దాయరా’లో.. సజ్జనార్ తరహా పాత్ర చేశ

ABN, Publish Date - Sep 17 , 2026 | 11:26 AM

‘దాయరా’ సినిమా.. కేవలం దిశ ఎన్‌కౌంటర్‌కి సంబంధించింది కాదని.. నా పాత్ర సీపీ సజ్జనార్‌ని పోలి ఉంటుందని నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్ తెలిపారు.

Prithviraj Sukumaran

‘దాయరా’ (Daayra) సినిమాలో నేను చేసిన పాత్ర హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ని (VC.Sajjanar) పోలి ఉంటుంది. దిశ హత్యాచారం జరిగిన ప్రదేశంలో ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌తో పాటు కొన్ని క్లిప్పింగ్స్‌ కూడా చూశాను. అప్పుడు ఆయన వాడిన మాటలకు దగ్గరగా ఉండే సంభాషణలు మా సినిమాలో ఉంటాయి’ అని నటుడు పృథ్విరాజ్‌ సుకుమారన్ (Prithviraj Sukumaran) తెలిపారు.

ఆయన, క‌రీనా క‌పూర్ (Kareena Kapoor)ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన ‘దాయరా’ చిత్రం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుటకు వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో నిర్వ‌హించిన విలేకరుల సమావేశంలో పృథ్విరాజ్‌ మాట్లాడుతూ ‘దాయరా’ సినిమా కేవలం దిశ ఎన్‌కౌంటర్‌కి సంబంధించింది కాదు. అలాంటి పలు ఘటనలను ప్రస్తావిస్తుంది. ఇందులో రెండు కోణాల్లో కథ నడుస్తుంది. వాటిని డైరక్టర్‌ మేఘన (Meghna Gulzar) చాలా చక్కగా డీల్‌ చేశారు’ అని అన్నారు.

‘వారణాసి’ గురించి మాట్లాడుతూ ‘నేను ‘దయారా’కి, ‘వారణాసి’కి ఏక సమయంలోనే షూటింగ్‌ చేశాను. రెండూ సంతృప్తినిచ్చాయి. ప్రేక్షకులు సినిమాల బడ్జెట్‌ల గురించి పట్టించుకోరు. కంటెంట్‌ బావుంటే తప్పక ఆదరిస్తారు. ఇటీవలే విడుదలైన ‘హనుమాన్‌ అంశ్‌’ సినిమా దానికి పెద్ద ఉదాహరణ’ అని చెప్పారు. కన్నడ మినహా దక్షిణాది భాషలన్నిటిలోనూ సినిమాలు చేశానని, ఏ భాషలోనైనా భావోద్వేగాలను పండించే తీరు ఒకేలా ఉంటుందని ఆయన వెల్లడించారు.

Updated Date - Sep 17 , 2026 | 11:57 AM