Parineethi Chopra : పెళ్లైన నెలకి ఇలా ఎవరైనా చేస్తారా?

ABN , First Publish Date - 2023-10-17T10:50:00+05:30 IST

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా (𝙿𝚊𝚛𝚒𝚗𝚎𝚎𝚝𝚒 𝙲𝚑𝚘𝚙𝚛𝚊) ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కొద్దిరోజులు క్రితమే ఆప్‌ యువ నాయకుడు రాఘవ్‌ చద్థాతో రాజస్థాన ఉదయ్‌పూర్‌లో ఆమెకు పెళ్లయింది. వీరిద్దరూ ఛైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్‌. చాలాకాలంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది.

Parineethi Chopra : పెళ్లైన నెలకి ఇలా ఎవరైనా చేస్తారా?

బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా (𝙿𝚊𝚛𝚒𝚗𝚎𝚎𝚝𝚒 𝙲𝚑𝚘𝚙𝚛𝚊) ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. కొద్దిరోజులు క్రితమే ఆప్‌ యువ నాయకుడు రాఘవ్‌ చద్థాతో రాజస్థాన ఉదయ్‌పూర్‌లో ఆమెకు పెళ్లయింది. వీరిద్దరూ ఛైల్డ్‌హుడ్‌ ఫ్రెండ్‌. చాలాకాలంగా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. పార్టీలు, రెస్టారెంట్లు అంటూ చెట్టాపట్టాలేసుకున బాగానే తిరిగారు. ఎన్నోసార్లు మీడియా కెమెరాలకు చిక్కారు. గత నెల 24 ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే పరిణితి చోప్రా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. రాఘవ్‌ చద్దాతో (Raghav chedda) పెళ్లి తర్వాత అనంతరం గ్రాండ్‌గా హనీమూన్‌ ప్లాన్‌ను చేసుకుంటుందని భావించారు అంతా.

(𝙿𝚊𝚛𝚒𝚗𝚎𝚎𝚝𝚒 𝙲𝚑𝚘𝚙𝚛𝚊).avif

కానీ పరి మాత్రం భర్తతో లేకుండా మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లి బాగా ఎంజాయ్‌ చేస్తోంది. కానీ ఆమె ఈ వెకేషన్‌కు తన మరదలితో వెళ్లినట్లు తెలిపింది. ‘నేను హానిమూన్‌కు వెళ్లలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. ఇది గర్ల్స్‌ ట్రిప్‌’ అంటూ బికినీలో ఉన్న ఒక ఫోటో షేర్‌ చేసింది. ఆమె చేసిన పోస్ట్‌ చూసిన అభిమానులు నెటిజన్లు 'మరదలితో హనిమూన్‌ ఏంటి..? కొత్తగా పెళ్లైన వారు జంటగా వెళ్తే ఆ మధుర క్షణాలు చెప్పలేనివి’ అని కొందరు కామెంట్‌ చేయగా, మరికొందరు పెళ్లై నెల కాలేదు భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్నావా’ వైరల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-10-20T10:43:47+05:30 IST