సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏం లేదు సినిమాలో.. రామాయణపై రీల్ కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Nov 11 , 2026 | 03:54 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), యశ్ (Yash), సాయి పల్లవి, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రం రామాయణ(Ramayana). నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

Nitish Bharadwaj

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), యశ్ (Yash), సాయి పల్లవి, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రం రామాయణ(Ramayana). నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాని నమిత్ మల్హోత్రా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న విషయం తెల్సిందే. టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు హాలీవుడ్ నుంచి కూడా చాలామంది సెలబ్రిటీలు రామాయణపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ సమయంలో బి.ఆర్. చోప్రా క్లాసిక్ టీవీ సిరీస్ మహాభారత్ లో శ్రీకృష్ణుడి పాత్రతో ప్రతి ఒక్కరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న సీనియర్ నటుడు నితీష్ భరద్వాజ్ (Nitish Bharadwaj) మాత్రం అసలు రామాయణలో ఏమి లేదని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.


సినిమా చూసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో 'యశ్ పోషించిన రావణాసురుడి పాత్రను అత్యంత ఉదారవాదిగా, సామాజిక న్యాయం పాటించే నిష్పాక్షిక వ్యక్తిగా చిత్రీకరించారు. ఇది రామాయణ నైతిక చట్రాన్ని మార్చివేసి అవతార పురుషుడి అంతర్లీన లక్ష్యాన్నే దెబ్బతీస్తోంది. విఎఫ్‌ఎక్స్ హంగులు, విజువల్స్ ఎప్పటికీ ఈ మహాకావ్యం యొక్క ఆధ్యాత్మిక సారాన్ని, ప్రాథమిక విలువలను, తాత్విక లోతును భర్తీ చేయలేవు. గతంలో సినిమా బావుందని నేను చేసిన పోస్ట్‌ను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ చిత్రం నన్ను తీవ్రంగా నిరాశపరిచింది, బాధించింది. ఈ సినిమా గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పడానికి నాకు ఏదీ కనిపించడం లేదు' అని చెప్పుకొచ్చాడు.


ఇప్పటికే రామాయణ సినిమాని చాలాసార్లు చూసిన ఆయన మొదట ఈ సినిమా చూసినప్పుడు నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ, విఎఫ్‌ఎక్స్‌లను విపరీతంగా ప్రశంసించాడు. అంతేకాకుండా ఆస్కార్ అవార్డు సాధిస్తుందని అంచనా వేయడమే కాకుండా, సత్యజిత్ రే, శేఖర్ కపూర్ చిత్రాల తర్వాత ప్రపంచ రంగానికి భారత్ ఇచ్చిన గొప్ప కానుక అని కొనియాడాడు. ఆ తరువాత ఏమైందో ఏమో తెలియదు కానీ, ఇప్పుడు తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవడం గమనార్హం. ఇటీవల సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా కూడా సీతమ్మ వారి పాత్ర చిత్రీకరణపై విమర్శలు గుప్పించగా, ఇప్పుడు నితీష్ భరద్వాజ్ కామెంట్స్ ఫిలిం వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మరి ఈ కామెంట్స్ పై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - Nov 11 , 2026 | 04:04 PM