Lust Stories 3: లస్ట్ స్టోరీస్ 3.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ABN , Publish Date - Sep 05 , 2026 | 03:26 PM
‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నయో తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగంగా ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్ 3’ ప్రేక్షకుల్ని పలకరించనుంది.
‘లస్ట్ స్టోరీస్’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నయో తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీలో మూడో భాగంగా ఇప్పుడు ‘లస్ట్ స్టోరీస్ 3’ ప్రేక్షకుల్ని పలకరించనుంది. ఈ ఆంథాలజీలో సిద్ధార్థ్, అదితీరావ్ హైదరీ, రాధికా ఆప్టే, కొంకణా సేన్ శర్మ, రాధికా మదన్, విజయ్ వర్మ, అభిషేక్ బెనర్జీ, అలీ ఫజల్ తదితర నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాలుగు విభిన్న కథలతో రూపొందిన ఈ చిత్రాన్ని విక్రమాదిత్య మొత్వానే, కిరణ్‌రావు, శకున్ బత్రా, విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు.
ఈ నాలుగు లఘుచిత్రాలు.. ప్రేమ, ఆకర్షణ, వాంఛ, అనుబంధాల చుట్టూ తిరిగే సమకాలీన కథలను విభిన్న కోణాల్లో ఆవిష్కరించనున్నాయి. ప్రతి కథకు ప్రత్యేకమైన నేపథ్యం, పాత్రలు, భావోద్వేగాలు ఉండేలా ఈ ఆంథాలజీని రూపొందించినట్లు తెలుస్తోంది. గత రెండు భాగాలకు భిన్నంగా ఈసారి కూడా వైవిధ్యమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు మేకర్స్. ‘లస్ట్ స్టోరీస్ 3’ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 18 నుంచి ఈ ఆంథాలజీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ALSO READ:
Kasthuri Shankar: హీరోల పాత్రపై కస్తూరి సెటైర్స్.. నెటిజన్ల కౌంటర్స్
ఇతనే నా లవర్.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన ప్రముఖ తెలుగు యూట్యూబర్
Biggboss 10: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. హౌస్‌లోకి వెళ్లేది వీళ్లేనా?