ప్రొడ్యూసర్‌గా కార్తీక్ ఆర్యన్ అరంగేట్రమ్!
ABN, Publish Date - Nov 05 , 2026 | 03:12 PM
బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ నిర్మాతగా మారాడు. కబీర్ ఖాన్‌తో కలిసి 'లడాకు' సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా, వచ్చే ఏడాది జూన్ 18న విడుదల కానుంది.
బాలీవుడ్ యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు నిర్మాతగా మారాడు. 2011లో 'ప్యార్ కా పంచనామా'తో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్ వైవిధ్య భరితమైన పాత్రలు చేసి, నటుడిగా మెప్పించాడు. ఇవాళ బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం 'నాగ్‌జిల్లా', ఇంకా పేరు నిర్ణయించని అనురాగ్ బసు చిత్రంలోనూ నటిస్తున్న కార్తీక్ ఆర్యన్... తొలిసారి ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. 'కాబుల్ ఎక్స్ ప్రెస్' దర్శకుడు కబీర్ ఖాన్ తో కలిసి ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. 'లడాకు' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీక్ ఆర్యనే హీరో! అతని సొంత నిర్మాణ సంస్థ డోపమైన్ స్టూడియోస్ తో కలిసి ఈ సినిమాను కబీర్ ఖాన్ ఎంటర్ టైన్ మెంట్స్, బిర్లా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వచ్చే యేడాది జూన్ 18న విడుదల కాబోతున్న 'లడాకు' ఎమోషనల్, హార్ట్ వార్మింగ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందట. 'చందు ఛాంపియన్' తర్వాత కబీర్ ఖాన్ దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ నటించడం ఇది రెండోసారి. భారతదేశపు మొదటి పారాలింపిక్స్ బంగారు పతక విజేత మురళీకాంత్ జీవితగాథ ఆధారంగా 'చందు ఛాంపియన్' మూవీని తెరకెక్కించారు. మరి వీరి కాంబోలో రాబోతున్న రెండో సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ
చిరంజీవి అమెరికా టూర్.. ‘కాకా’ ఫస్ట్ సాంగ్‌పై థమన్ అదిరిపోయే అప్‌డేట్!
Meenakshi Chaudhary: మీనాక్షికి మరో ఆఫర్... ఎవరితో అంటే..
DADA: క్రిస్మస్ రేస్ నుంచి.. బాలయ్య ఔట్?