సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

15 ఏళ్ళ స్నేహం.. నాలుగేళ్ళ సంసారం.. చివరకు విడాకులు

ABN, Publish Date - Nov 05 , 2026 | 05:58 PM

ఈ రోజుల్లో సినీ, గ్లామర్ వర్గాల్లో విడాకుల వార్తలు రావడం చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు జీవితాంతం తోడుంటామని ఏడడుగులు వేసిన జంటలు.. కొద్ది కాలానికే అభిప్రాయాలు కలవక విడిపోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్ సింగర్ రెండోసారి విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Kanika Kapoor Divorce

గ్లామర్ వరల్డ్ కొత్త ట్రెండ్‌లో నడుస్తోంది. ఇక్కడి వాళ్ళు పెళ్ళిళ్ళు, విడాకులు ఈజీగా ఇచ్చేసుకుంటున్నారు. ఎంతో వైభవంగా పెళ్ళి చేసుకున్న కొన్ని బంధాలు అర్ధాంతరంగా ముగియడం అభిమానులను నిరాశకు గురిచేస్తూనే ఉంటుంది. సెలబ్రెటీల మధ్య ఈ రోజు చిగురించిన ప్రేమబంధం, రేపు ఏ తీరానికి చేరుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాల పాటు కలిసి నడిచిన ఏ. ఆర్. రెహమాన్ - సైరా బానుల నుంచి, ఎంతో అన్యోన్యంగా కనిపించిన ధనుష్ - ఐశ్వర్య, నాగ చైతన్య - సమంత, జీవీ ప్రకాష్ - సైంధవి, జయం రవి - ఆర్తి వరకు అనేక జంటలు తమ సుదీర్ఘ జీవనయానానికి స్వస్తి పలికాయి. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సింగర్ కనికా కపూర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తెలిపిన షాకింగ్ న్యూస్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


'బేబీ డాల్' పాటతో ఓవర్‌నైట్ ఇండియా వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న సింగర్ కనికా కపూర్ తన భర్త గౌతమ్ హతిరమాని నుంచి విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2022లో లండన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ఘనంగా జరిగిన వీరి వివాహం.. నాలుగేళ్ళకే ముగిసిపోవడం అభిమానుల మధ్య పెద్ద చర్చకే దారితీసింది. గౌతమ్‌తో దాదాపు 15 ఏళ్ళ స్నేహం ఉన్న కనిక.. అతనికి స్వయంగా ప్రపోజ్ కూడా చేశారట. ఆ తర్వాత 2021లో గౌతమ్ ప్రపోజ్ చేయడంతో పెళ్లి పీటలెక్కారు. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. తన విడాకుల గురించి రియాక్ట్ అయిన కనిక... తప్పు ఎవరిదో కాదని.. థర్డ్ పర్సన్ లేదా వేరే లవ్ అఫైర్స్ కారణం కాదని స్పష్టం చేసింది. రెండోసారి విడాకులు తీసుకోవడం తనను తీవ్ర భావోద్వేగానికి.. నిరాశకు గురిచేసిందని వాపోయింది. అంతేకాదు పెళ్ళి విఫలమైతే ఎప్పుడూ ఆడవాళ్ళనే నిందించడం అలవాటైపోయిందని.. కానీ నిజానికి ఇద్దరి మధ్య ఏం జరిగిందో వారిద్దరికే తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని అభిమానులను ఆమె కోరింది.

అంతకుముందు కేవలం 18 ఏళ్ల చిన్న వయసులోనే 1998లోవ్యాపారవేత్త రాజ్ చందోక్‌ను వివాహం చేసుకుని 2012లో విడాకులు తీసుకున్న కనికాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చి 'లవ్లీ', 'దేశీ లుక్', 'బీట్ పె బూటీ' వంటి చాట్ బస్టర్ సాంగ్స్‌తో పాపులారిటీ తెచ్చుకుంది. ఇక 'పుష్ప' చిత్రంలోని 'ఊ అంటావా' హిందీ వెర్షన్‌తో పాటు ఇటీవల 'గోరీ హై కలైయాన్' పాటతో యూట్యూబ్‌ను షేక్ చేసింది. కెరీర్ పరంగా వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్‌లో ఉన్న కనికా, పర్సనల్ లైఫ్‌లో మాత్రం మరోసారి ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి:

‘ఫలక్‌నుమా దాస్’, ‘కల్ట్’ యాక్టర్‌‌కు హీరోగా ఛాన్స్

భాగ్యశ్రీ బోర్సే సీక్రెట్ టాలెంట్.. నెట్టింట వైరల్

ఇంతింతై వటుడింతై.. నెల్సన్ గ్రాఫ్ చూశారా

Updated Date - Nov 05 , 2026 | 05:59 PM