Kangana: బికినీతో రాఖీ ఎందుకు కడతారు..కృతిపై కంగనా ఫైర్
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:51 PM
కృతి సనన్ నటించిన ఓ రాఖీ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
కృతి సనన్(kritisanon) నటించిన ఓ రాఖీ యాడ్ (rakhi ad) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. రక్షా బంధన్ నేపథ్యంలో రూపొందించిన ఈ ప్రకటనలో కృతి ధరించిన దుస్తులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కూడా ఈ యాడ్‌పై మండిపడ్డారు. 'రాఖీ పండుగ అంటే ప్రతి సోదరికీ ఎంతో ప్రత్యేకమైన రోజు. అంత గొప్ప సమయంలో హుందాగా కనిపించాలి. ఈ సాంప్రదాయ పండగకు సంబంధించిన ప్రకటనలో ఇలాంటి దుస్తులా ధరించేది?
ఈ రోజుల్లో మహిళలకు లెహంగాలు, జీన్స్, సల్వార్ కమీజ్, చీరలు, పంజాబీ డ్రెస్‌లు.. చాలా రకాలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా.. ఇలాంటి బికినీ ధరించి రాఖీ ఎందుకు కడతారు?. ఈ యాడ్ చేసిన స్టైలిష్ట్‌కు ఈ ఆప్షన్లు కనిపించలేదా? చాలా అసహ్యంగా కనిపిస్తోంది’ అని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. మరోవైపు యాడ్‌లో కృతి పెంపుడు కుక్కకు రాఖీ కడుతున్న సన్నివేశం కూడా విమర్శలకు కారణమైంది. ఈ అంశంపై సోషల్ మీడియాలో కృతి సనన్‌ను పలువురు ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై కృతి కానీ, యాడ్ సంస్థ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.
ALSO READ:
Bethlehem Kutumba Unit: మమితా బైజు మళ్ళీ వచ్చేస్తోంది!
ఇషాన్ ఖట్టర్ లవ్ బ్రేకప్! కారణం ఎవరంటే...
Kollywood Strike: కోలీవుడ్ లో సమ్మె సెగ..నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి