ఇషాన్ ఖట్టర్ లవ్ బ్రేకప్! కారణం ఎవరంటే...
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:42 PM
దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రేమాయణం సాగిస్తున్న ఇషాన్ ఖట్టర్, చాందినీ బైంజ్ విడిపోయినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకు సారా అర్జున్ కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ ఇషాన్ ఖట్టర్ ప్రేమాయాణానికి బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. గడిచిన మూడేళ్ళుగా ఇషాన్ మోడల్ చాందినీ బైంజ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నారు. వీరిద్దరూ తమ డేటింగ్ విషయాన్ని ఎక్కడా రహస్యంగా ఉంచే ప్రయత్నం చేయలేదు. హాయిగా చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండటంతో వీరి లవ్ మేటర్ బాలీవుడ్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే కొద్ది రోజులకే మీడియా ఈ ప్రేమజంటను పట్టించుకోవడం మానేసింది. అయితే... మూడేళ్ళ తర్వాత ఈ ప్రేమ పక్షులు విడిపోతున్నాయనే వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యింది.
నిజానికి ఇషాన్ ఖట్టర్ కానీ చాందినీ గానీ ఎప్పుడూ తాము రిలేషన్ లో ఉన్నామని చెప్పలేదు. కాకపోతే వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం కలిసి తిరగడంతో ఎవరికి వారు వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని ఊహించుకున్నారు. అలాంటి వ్యక్తులే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారని చెబుతున్నారు. కొంతకాలంగా ఇషాన్ చాందినీకి దూరంగా ఉంటున్నాడని, ఆమె స్థానాన్ని యువ నటి సారా అర్జున్ భర్తీ చేస్తోందని చెబుతున్నారు. ఇటీవల ఇషాన్, సారా అర్జున్ కలిసి గూగూల్ ఏ.ఐ. యాడ్‌లో నటించారు. వీరిద్దరి ఫోటో సెషన్ చూసి చాలామంది కలిసి సినిమా చేస్తున్నారని అనుకున్నారు. కానీ అది యాడ్ కోసం చేసిందని తెలిసింది. ఆ వాణిజ్య ప్రకటనలో ప్రేమజంటగా నటించిన వీరిద్దరి చూసి... జోడీ భలే ఉందే అనుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు.
బాల నటుడిగా ఇషాన్ కెరీర్ ప్రారంభించినట్టే.. సారా అర్జున్ సైతం బాలనటిగా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఇద్దరూ సినిమా రంగానికి చెందిన కుటుంబాల నుంచి వచ్చిన వారే. దాంతో వీరిద్దరి మధ్య కంఫర్ట్ లెవెల్ బాగుండి, ఆ యాడ్ లో జీవించేశారు. టామ్ అండ్ జెర్రీ తరహాలో ఈ వాణిజ్య ప్రకటన సాగినా... వారి మధ్య ఓ తెలియని బంధాన్ని దర్శకుడు అర్జున్ వరైన సింగ్ చక్కగా ప్రెజెంట్ చేశారు. దాంతో ఇషాన్, చాందినీ మధ్య గ్యాప్ ఏర్పడటానికి, వారి లవ్ బ్రేకప్ కు సారా అర్జున్ పరోక్షంగా కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఏమిటనేది వారిద్దరిలో ఎవరో ఒకరు చెబితేనే తెలుస్తుంది.
ఇవీ చదవండి:
బీజేపీపై సంచలన ఆరోపణలు.. విజయ్ ‘టీవీకే’లోకి నటుడు దేవన్
'ఇరుముడి' సినిమాపై వివాదం! ఆ సన్నివేశాలు తొలగించాలని డిమాండ్