మండోదరి.. నీ అందానికి ఎవరు రారు సరి
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:50 PM
దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ హంగులతో తెరకెక్కించిన రామాయణ (Ramayana) చిత్రంలో టాలీవుడ్, బాలీవుడ్ నుంచి భారీ తారాగణం నటించిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లంకేశ్వరుడైన రావణాసురుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ యశ్ అద్భుతమైన నటనతో అలరించారు.
దర్శకుడు నితీశ్ తివారీ అత్యంత భారీ హంగులతో తెరకెక్కించిన రామాయణ (Ramayana) చిత్రంలో టాలీవుడ్, బాలీవుడ్ నుంచి భారీ తారాగణం నటించిన ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, లంకేశ్వరుడైన రావణాసురుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ యశ్ అద్భుతమైన నటనతో అలరించారు. ఎన్నో అంచనాల నడుమ నవంబర్ 5 న రిలీజైన రామాయణ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒక్కరోజులోనే దాదాపు రూ.155 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోన్న ఈ సినిమాలో హైలైట్ గా నిలిచింది కాజల్ అగర్వాల్.
పెళ్లి తరువాత నుంచి కాజల్ మళ్లీ ఇండస్ట్రీలో తన పాత గుర్తింపు కోసం పోరాడుతూనే ఉంది. రీఎంట్రీలో లేడీ ఓరియెంట్ సినిమాల్లో నటించినా కూడా అవేమీ కూడా కాజల్ కి హిట్ ని అందించలేకపోయాయి. ఇక ఆ సమయంలోనే కాజల్.. రామాయణలో భాగం అయ్యినట్లు తెలిపింది. దీంతో ఆమె ఏ పాత్ర చేస్తుందో అని అందరూ ఎంతగానో ఎదురుచూశారు. చివరికి కాజల్.. రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపిస్తుంది అని తెలియగానే ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. అసలు రామాయణలో కాజల్ లాంటి అందాన్ని సీతమ్మగా చూపించకుండా మండోదరిగా చూపించడం ఏంటని ప్రశ్నించారు.
ఎప్పుడైతే సీత, మండోదరి లవోక్స్ బయటకు వచ్చాయో అప్పటి నుంచి ఇప్పటివరకు ఫ్యాన్స్ ట్రోలింగ్ మామూలుగా లేదు. కాజల్ అందం ముందు.. సాయిపల్లవి ఏ మూలకు పనికి వస్తుందని .. ఎలా తీసుకున్నారు ఆమెని సీతగా అని ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని ట్రోలింగ్స్ లో రామాయణ రిలీజ్ అయ్యింది. రిలీజ్ తరువాత ఈ ట్రోల్ మరింత ఎక్కువ అయ్యింది. ఎందుకంటే.. మండోదరిగా కాజల్ స్క్రీన్ పై కనిపిస్తుంటే ప్రేక్షకులు ఆమె అందానికి ముగ్ధులయ్యారు. ఇంత అందాన్ని ఇంట్లో పెట్టుకొని రావణుడు ఆ సీత వెనుక ఎలా పడ్డాడు అంటూ ప్రేక్షకులు లాజిక్స్ వెతుకుతూ కామెంట్స్ పెడుతున్నారు. అంతా పెద్ద స్క్రీన్ లో కాజల్ ఆ లుక్ లో ఒక అప్సరసలా మెరిసిపోయింది.
తాజాగా మండోదరి పాత్రపై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఆమె ప్రేక్షకులకు థాంక్స్ చెప్తూ కొన్ని బీటీఎస్ ఫోటోలను షేర్ చేసింది. 'రామాయణం' వంటి ఒక గొప్ప దృశ్యకావ్యంలో ఏ రకమైన భాగస్వామ్యం ఉన్నా, అది నాకు ఎంతో గర్వకారణమైన క్షణం. నా పాత్ర చిన్నదే అయినప్పటికీ... మన సంస్కృతి, మన చరిత్ర మరియు మన అస్తిత్వంతో ముడిపడి ఉన్న ఒక గొప్ప కథలో భాగం కావడం, అలాగే ఎంతో అభిరుచి మరియు నిబద్ధత కలిగిన అత్యుత్తమ కళాకారులు మరియు సాంకేతిక నిపుణుల బృందంతో కలిసి పనిచేయడం నా హృదయాన్ని ఆనందంతో నింపేసింది. నన్ను నమ్మి, మన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే, భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో అవకాశం ఇచ్చిన నమిత్ మల్హోత్రా, నితీశ్ తివారీ సర్ ఇద్దరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక కాజల్ అందానికి ఫ్యాన్స్ ఫిధా అవుతున్నారు. మండోదరి.. నీ అందానికి ఎవరు రారు సరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.