Janhvi Kapoor: కపూర్ ఫ్యామిలీలో పెళ్లి సందడి..
ABN, Publish Date - Jul 07 , 2026 | 02:28 PM
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ (Boney kapoor) కుమార్తె, జాన్వీ కపూర్ సోదరి అంషులా కపూర్ (Anshula Kapoor Wedding)పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ (Boney kapoor) కుమార్తె, జాన్వీ కపూర్ సోదరి అంషులా కపూర్ (Anshula Kapoor Wedding)పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌తో అంషులా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నెల 6న అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ, ఖుషీ కపూర్ ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే పెళ్లికూతురు అంషులా కపూర్ లుక్ అందరినీ కట్టిపడేసింది.
అర్జున్ కపూర్, అంషులా కపూర్, వారి సిస్టర్స్ జాన్వీ, ఖుషీ కపూర్ మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే! ఈ పెళ్లిలో సోదరీమణులు ఇద్దరూ అన్ని తామేయైు చూసుకున్నారు. జూలై 5న ముంబైలోని తమ ఇంట్లోనే అంషులా కోసం జాన్వీ, ఖుషీ ఒక స్పెషల్ మెహందీ వేడుకను ఏర్పాటు చేశారు. అంషులాకు నచ్చిన వంటకాలతో, ఆమెకు బ్యూటిఫుల్ సర్ర్పైజ్ ఇచ్చారు. ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేసిన ట్రెడిషనల్ అవుట్‌ఫిట్స్‌లో జాన్వీ, ఖుషీ మెరిసిపోయారు. ఇక జాన్వీ ఐవరీ కలర్ ఫ్లోరల్ లెహంగాలో మెరిసిపోగా, ఖుషీ కపూర్ పిస్తా గ్రీన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లెహంగా, హెవీ చోకర్‌తో మెస్మరైజ్ చేశారు.
ఇక పెళ్లిలో సింధూర్ వేడుక వంటి కీలక ఆచారాలన్నింటిలోనూ ఈ ఇద్దరు సోదరీమణులు యాక్టివ్‌గా పాల్గొని సందడి చేశారు. ఖుషీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెళ్లి ఫొటోలు షేర్ చేసి ‘వాళ్లు పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టబోతున్నారు’ అని పేర్కొన్నారు. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
పాలిటిక్స్‌లోకి ధనుష్.. ఈ హడావుడి అంతా అందుకేనా?
అక్కినేని వారబ్బాయికి.. నందమూరి వారసుని 'మాట సాయం'!