సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హనుమాన్‌ జయంతి.. రాముడు వచ్చేశాడు!

ABN, Publish Date - Apr 03 , 2026 | 06:30 AM

హనుమాన్‌ జయంతి సందర్భంగా ‘రామాయణ’ చిత్రం నుంచి ‘గ్లింప్స్‌ ఆఫ్‌ రామా’ను విడుదల చేశారు మేకర్స్‌.

ramayana

రణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా నటిస్తున్న ‘రామాయణ’ ( Ramayana) చిత్రంలో ఆయన లుక్‌ ఎలా ఉండబోతోంది అని ప్రేక్షకులంతా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. హనుమాన్‌ జయంతి (Hanuman Jayanti) సందర్భంగా వారి నిరీక్షణకు తెరదించి ‘గ్లింప్స్‌ ఆఫ్‌ రామా’ను విడుదల చేశారు మేకర్స్‌.

ఈ కార్యక్రమంలో నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) మాట్లాడుతూ ‘మన ఇతిహాస గాథ రామాయణం గొప్పదనం దాని భావోద్వేగ సంపన్నతలో ఉంది. ఇది మంచి చెడులనే కాదు.. బాధ్యత గురించి గొప్పగా వివరిస్తుంది. రాముడి పాత్రను తెరపై అద్భుతంగా ఆవిష్కరించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ సినిమా కోసం ఏడేళ్లు శ్రమించా. ఇప్పుడు ఈ గ్లింప్స్‌నకు మీ నుంచి వస్తున్న ఆదరణ చూసి ఎంతో సంతోషంగా ఉంది’ అని అన్నారు.

నమిత్‌ మల్హోత్రా మాట్లాడుతూ ‘ప్రపంచంలోని ప్రతీ దేశంలో భారతీయులు ఉన్నారు. మనదంతా ఒకే ప్రపంచం.. అందులో రామాయణం ఒక్కటే.. రాముడు కూడా ఒక్కడే. ఈ సినిమా గ్లింప్స్‌ను మొదట లాస్‌ ఏంజిల్స్‌లో విడుదల చేశాం. నార్త్‌ అమెరికాలో ఉన్న మన భారతీయుల భావోద్వేగాలను అర్థం చేసుకునేందుకు అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ‘రామాయణ’ను తీసుకొస్తున్నందుకు వారందరు ఎంతో సంతోషంతో ఉన్నారు’ అని చెప్పారు.

‘రామాయణ’లో రాముడిగా కనిపించడానికి కాదు.. ఆయన నుంచి నేర్చుకోవడానికి ఈ పవిత్రమైన పాత్రను పోషిస్తున్నా’ అని రణ్‌బీర్‌ కపూర్‌ తెలిపారు. గ్లింప్స్‌లో విజువల్స్‌, సంగీతం, పోరాట ఘట్టాలు కట్టిపడేసేలా ఉన్నాయి. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్లపై నమిత్‌ మల్హొత్రా, యశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సీత పాత్రలో సాయి పల్లవి, రావణుడిగా యశ్‌ నటిస్తున్నారు. రూ.4000 వేల కోట్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్‌ దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

Updated Date - Apr 03 , 2026 | 06:30 AM